Palnadu: పల్నాడు జిల్లాలో ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ ఘటనపై ఈసీ సీరియస్ అయ్యింది. డీజీపీని, సీఈవోను వివరణ కూడా అడిగింది. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాలో భారీగా పోలీసులను మోహరించారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో పోలీస్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎలక్షన్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో పోలీస్ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే గ్రామ గ్రామాన పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.
Read Also: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. పలు గ్రామాల్లో మారనాయుధాలపై పోలీసుల గురి పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల కౌంటింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పోలీసులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో పల్నాడులో అదనంగా పోలీసు అధికారులను అపాయింట్ చేశారు. ప్రస్తుతం పల్నాడులో నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ భద్రతను కూడా ఎన్నికల సంఘం పరిశీలించనున్నారు.