ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకరుగా బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. బుచ్చయ్య చౌదరితో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు వెళ్లారు.
ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేపట్టారని, రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదన్నారు. గురువారం అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్డీఏ కార్యాలయం సీఎం చంద్రబాబు మాట్లాడారు. అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు.
టీడీపీ గతంలో చాలా కష్టాలు, ఒడిదొడుకులు ఎదుర్కొందని, నిద్ర లేని రాత్రులు గడిపామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన టీడీపీ నేతలు మాట్లాడలేకపోయేవారని గుర్తు చేసుకున్నారు.
ప్రకాశం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్దా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత వైఎస్ జగన్కు రాజీనామా లేఖను పంపారు.
ఏపీకి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి.. అధికారులతో పోలవరం ప్రాజెక్టు, స్పిల్ వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తిరుపతిలోని రుయా ఆస్పత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చివేశారని ఆయన విమర్శించారు. అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని, నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు.
ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పోలా భాస్కర్ ను నియమించింది. కాలేజ్ విద్య కమిషనర్ పోలా భాస్కర్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ మంత్రి నారా లోకేశ్ తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు మంచి చేసేందుకు రంగంలోకి దిగారు. శనివారం మంగళగిరి ఎమ్మెల్యేగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 'ప్రజా దర్బార్' ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి.. రెండో రోజూ ఆదివారం కూడా ప్రజా దర్బార్ను మంత్రి నారా లోకేష్ నిర్వహించారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిపై దృష్టి సారించిన ఏపీ సర్కారు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అవినీతే పరమావధిగా జలవనరుల శాఖను వైసీపీ పాలకులు దుర్వినియోగం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
వేసవి సెలవుల అనంతరం ఏపీలో నేడు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇక విద్యార్థులు, ఉపాధ్యాయులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. ప్రతి ఏటా జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కానీ ఈ ఏడాది నూతన ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో అదనంగా ఓ రోజు సెలవు వచ్చింది.