ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నెం.256ను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్ హామీ కొంచెం లేటైనా నెరువేర్చుతామని రాష్ట్ర రవాణా, క్రీడల శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో క్షుణ్ణంగా పరిశీలించి ఏపీలో అమలు చేస్తామని వెల్లడించారు.
Pension In AP : నేడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ( Anam Ramanarayana Reddy ) మీడియా వేదికగా మాట్లాడారు. ఇందులో భాగంగా 65 లక్షల పేద కుటుంబాలకు మేలు జరిగేలా సంక్షేమాన్ని అమలు చేస్తామని, ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారని, జులై 1 న పెంచిన పెన్షన్ లను ఇస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చారని ఆయన చెప్పుకొచ్చారు. రూ.3 వేల పెన్షన్…
MEGA DSC 2024 : డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ సర్కార్ తుది కసరత్తును చేస్తోంది. రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల రెండు రకాలుగా నోటిఫికేషన్ ఇవ్వక తప్పని పరిస్థితి. మూడేళ్ల నుంచి టెట్ పరీక్ష నిర్వహించని గత ప్రభుత్వం వల్ల టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి మెగా డీఎస్సీకి ఓ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. టెట్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి నేరుగా…
CI Transfer : తాజాగా ఏపీలో ఓ సీఐ పై బదిలీ వేటు పడింది. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఉన్న సమయంలో ఓ సీఐ అనుమతి లేకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. సిఐ లోపలికి వెళ్లే సమయంలో.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు నిర్వహిస్తున్నాడు. దాంతో పవన్ కళ్యాణ్ భద్రత సిబ్బంది ఆ సిఐ కి లోపలికి వెళ్లేందుకు కొద్దిసేపు ఆగాలని చెప్పారు. అయితే వారి మాటలను లెక్క…
Leopard in Dig : ఈ మధ్యకాలంలో అభయ అరణాలల్లో ఉండాల్సిన క్రూరమృగాలు ప్రజలు ఉండే ప్రాంతంలోకి రావడం కామన్ గా మారిపోయింది. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, చిరుతలు లాంటి అడవి జంతువులు కొన్నిసార్లు ప్రజలు ఉన్న ప్రాంతాల్లోకి రావడం పరిపాటిగా మారిపోయింది. గత కొన్ని రోజుల నుంచి ఏపీ లోని కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలలో చిరుతపులలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలోని మహానంది గుడి సమీపంలో ఓ చిరుత పులి తిరగడంతో ప్రజలు…
Pinnelli Ramakrishna Reddy : ఈవీఎం ధ్వంసం, మరో మూడు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. ఏపీలో మే 13 వ తేదీన పోలింగ్ జరగగా, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని రెంటచింతల మండలోని పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ నెం.202 లో ఆనాటి సిట్టింగ్ ఎమ్మెల్యే పి. రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనను భారత ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.…
Spoon in Beer Bottle : ఈ మధ్యకాలంలో తినే ఆహారంలో తినాల్సిన వాటికంటే తినరాని వస్తువులు లేదా ఇతర జంతువులు ప్రత్యక్షమవుతున్నాయి. వీటికి సంబంధించి అధికారులు ఆయా విక్రయ దారులపై చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి సంఘటననే తాజాగా సీల్డ్ బీర్ బాటిల్ లో ఓ ప్లాస్టిక్ స్పూన్ ప్రత్యక్షమైంది. ఈ సంఘటన నంద్యాల జిల్లా డోన్ నగరంలో చోటుచేసుకుంది. డోన్ పట్టణంలోని బేతంచెర్ల సర్కిల్ వద్ద ఉన్న వైన్ షాపులో యువకుడు బీర్ సీసా…
తెరుచుకున్న ఏపీఎండీసీ కార్యాలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ), మైనింగ్ డైరెక్టర్ కార్యాలయాలు తెరుచుకున్నాయి. మైనింగ్ శాఖ ఇంఛార్జి బాధ్యతలను సోమవారం యువరాజ్ చేపట్టగా.. ఈ రోజు రెండు కార్యాలయాలు తెరవటానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మైనింగ్ డైరెక్టర్ కార్యాలయం ఓపెన్ చేయగా.. ఉద్యోగులు విధుల్లో చేరారు. మరోవైపు ఏపీఎండీసీ కార్యాలయం కొద్దిసేపట్లో ఓపెన్ కానుంది. విధుల్లో చేరేందుకు ఉద్యోగులు కార్యాలయం ముందు ఎదురు చూస్తున్నారు. జూన్ 9న ఏపీఎండీసీ, మైనింగ్ డైరెక్టర్ కార్యాలయాలను…
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ, యానాంలో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం (జూన్ 26) బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఈ అల్పపీడనం బలపడుతూ.. ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. అదే రోజున అల్పపీడనం ఏపీ తీరాన్ని తాకనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురవన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ముసురు వాతావరణం ఏర్పడనుంది.…