IAS Transfers: ఏపీలో భారీగా కలెక్టర్లను బదిలీలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 26 జిల్లాలకు గానూ 13 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. జీఏడీకి రిపోర్టు చేయాలని ఏడు జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. గుంటూరు కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మి నియామకం కాగా.. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రస్తుత గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి ఆదేశాలు జారీ అయ్యాయి. విశాఖ కలెక్టర్ మల్లికార్జు్న్ జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విశాఖ కలెక్టర్‌గా విశాఖ జేసీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. అల్లూరి జిల్లా కలెక్టర్‌గా ఏఎస్ దినేష్‌కుమార్‌ను నియమించగా.. ప్రస్తుత అల్లూరి జిల్లా కలెక్టర్ విజయ్ సునీతాను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. కాకినాడ కలెక్టర్‌గా షన్‌మోహన్ నియమితులయ్యారు. జీఏడీకి రిపోర్టు చేయాలని జే. నివాస్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏలూరు కలెక్టర్‌గా వెట్రి సెల్వీ నియమితులు కాగా.. జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రసన్న వెంకటేశ్‌ను ప్రభుత్వం ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి, జీఏడీకి మాధవిలత.. విజయనగరం కలెక్టర్‌గా బీఆర్ అంబేద్కర్‌ను నియమించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా నాగరాణి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సుమీత్‌కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా సుజన నియమితులయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ప్రస్తుత కలెక్టర్ ఢిల్లీ రావును జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్ హన్సారియా నియామకమయ్యారు. కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా రంజిత్ భాష, బాపట్ల జేసీకి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Read Also: Deputy CM Pawan Kalyan: అటవీ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో డిప్యూటీ సీఎం భేటీ
సీనియర్ ఐఏఎస్ అధికారి పీయూష్ కుమార్ ఏపీకి తిరిగి వచ్చారు. పీయూష్ కుమార్‌ను కేంద్ర సర్వీసుల నుంచి రీలివ్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రంలో పని చేస్తున్న ఏపీ కేడర్ అధికారులను రాష్ట్రానికి పంపాలని ఇటీవలే డీవోపీటీకి చంద్రబాబు లేఖ రాశారు. ప్రస్తుతం కేంద్రంలో కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖ అదనపు సెక్రటరీగా పీయూష్ కుమార్ విధులను నిర్వహిస్తున్నారు. ఏపీలో ఫైనాన్స్ శాఖ బాధ్యతలను పీయూష్‌కు అప్పగించే అవకాశం ఉంది. కేంద్రంలో మంచి పరిచయాలు ఉండడంతో పీయూష్‌ను ప్రభుత్వం ఏపీకి రప్పించుకుంది. త్వరలో కేంద్రంలో పని చేస్తున్న ఇంకొందరు సీనియర్ ఐఏఎస్‌లు ఏపీకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.
కలెక్టర్లుగా వీరే..
గుంటూరు కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మి
విశాఖ కలెక్టర్‌గా విశాఖ జేసీకి అదనపు బాధ్యతలు
అల్లూరి జిల్లా కలెక్టర్‌గా ఏఎస్ దినేష్‌కుమార్
కాకినాడ కలెక్టర్‌గా షన్‌మోహన్
ఏలూరు కలెక్టర్‌గా వెట్రి సెల్వీ
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి
జయనగరం కలెక్టర్‌గా బీఆర్ అంబేద్కర్
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా నాగరాణి
చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సుమీత్‌కుమార్
చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సుమీత్‌కుమార్
ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్ హన్సారియా
కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా రంజిత్ భాష
బాపట్ల జేసీకి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు