గ్రేటర్ విశాఖ ప్రజలకు తాత్కాలిక ఊరట: గ్రేటర్ విశాఖ ప్రజలకు తాత్కాలిక ఊరట లభించింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కాంట్రాక్ట్ వాటర్ వర్కర్స్ సమ్మెను తాత్కాలికంగా విరమించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన చర్చలలో జీవీఎంసీ గడువు కావాలని కోరింది. వర్కర్స్ డిమాండ్లను బుధవారం లోపు నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. జీవీఎంసీ మాట తప్పితే.. శుక్రవారం నుంచి తిరిగి నిరవధిక సమ్మెకు వెళతాం అని యూనియన్లు హెచ్చరించాయి. తాత్కాలిక సమ్మె విరమణతో కాంట్రాక్ట్…
విశాఖ నగరానికి మంచినీటి ముప్పు: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) వాటర్ సప్లై కార్మికులు సమ్మె చేపట్టడంతో.. విశాఖ నగర వాసులు నానా అవస్థలకు గురవుతున్నారు. కార్మికుల నిరవధిక సమ్మె కారణంగా జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులతో పాటు పరిశ్రమలకు తాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. పంపింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు కార్మికులు విధుల బహిష్కరించి.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ల పరిష్కారంలో అధికారులు, మేయర్ ఆసక్తి చూపకపోవడంతో ఈ సమ్మెకు దిగినట్లు కార్మికులు…
ఎమ్మెల్యే అనుచరుడి అడియో కలకలం: చిత్తూరు జిల్లాలో జీడీ నెల్లూరు ఎమ్మెల్యే ధామస్ అనుచరుడి గ్రానైట్ దందా సంబంధించిన ఆడియో కలకలం రేపింది. జీడీ నెల్లూరు ఎమ్మెల్యే ధామస్ అనుచరుడు హారీష్ యాదవ్ తో సంతనూతలపాడుకు చెందిన గ్రానైట్ క్వారీ యాజమాని వెంకటేశ్వర్ రెడ్డి వద్ద యాబై లక్షలు తీసుకుని పనులు చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు గ్రానైట్ యాజమాని. కార్వేటినగరము నగరం మండలంలోని గ్రానైట్ ప్యాక్టరీ కోసం ఒప్పందంలో భాగంగా ఎమ్మెల్యే…
నేడు వైసీపీలో చేరనున్న సీనియర్ నేత: ఉమ్మడి కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం నేడు వైసీపీలో చేరనున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సుగవాసి వైసీపీలో చేరనున్నారు. మాజీ టీడీపీ నేత బాలసుబ్రమణ్యం ఇప్పటికే రాయచోటి నుండి విజయవాడకు బయల్దేరారు. ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో బాలసుబ్రమణ్యం జగన్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకోనున్నారు. రాయచోటి నియోజకవర్గంలో బలమైన…
ఏపీ ప్రభుత్వానికి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సంచలన లేఖ: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించేందకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారని తిరుపతి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ.. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. లిక్కర్ స్కామ్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని సీఎం చంద్రబాబు,…
రెడ్ జోన్ పరిధిలోకి ఆర్కే బీచ్ ఏరియా: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ ఏరియా తాత్కాలిక రెడ్ జోన్ పరిధిలోకి వచ్చింది. నేటి నుంచి 96 గంటల పాటు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నావల్ కోస్ట్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు ఆంక్షలు కొనసాగుతాయని వైజాగ్ సిటీ పోలీసు కమిషనర్ తెలిపారు. 5 కిలో మీటర్ల పరిధిలో ప్రైవేట్ డ్రోన్లను ఎగురవేయడం, నిరసనలు, ర్యాలీలు చేపట్టడం లాంటి కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు…
తిరుపతి రూరల్ (మం) దామినీడులో నాగాలమ్మ ఆలయం కూల్చివేతపై ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ సూచన మేరకు ఆర్డీవో, డిఎస్పీ ఇరువురితో సమాలోచన జరిపారు. కూల్చి వేసిన ప్రాంగణాన్ని యధావిధిగా గ్రామస్థులకు వదిలేయాలని కృష్ణమూర్తి నాయుడుకి ఆదేశాలు జారీ చేశారు. నేలమట్టం చేసిన ప్రాంతంలోనే తిరిగి ఆలయాన్ని పునర్ నిర్మించాలని సూచించారు. నెలరోజుల్లో ఆలయ నిర్మాణాన్ని యధావిధిగా నిర్మిస్తానని కృష్ణమూర్తి నాయుడు అంగీకరించారు.
మహిళలు బయటకు వచ్చే వరకు ప్రభుత్వం స్పందించలేదు: రాజధాని మహిళలను కించపరిచేలా జర్నలిస్ట్ అని చెప్పుకునే కృష్ణంరాజు నీచంగా మాట్లాడారని కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. నాలుగేళ్లు అలుపెరగని పోరాటం చేసిన మహిళలను దూషిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరలా మహిళలు పోరాటం చేయాల్సిన పరిస్థితికి తెచ్చారన్నారు. ఇంత జరిగినా రాజధాని మహిళలు బయటకు వచ్చే వరకు ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను…
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో గత 10-15 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్స్ పూర్తిగా నిండిపోయి.. వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న 88,257 మంది భక్తులు శ్రీవారిని…