ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి రెండు రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. బుధ, గురువారాల్లో కుప్పంలో పర్యటన కొనసాగనుంది. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలంలోని తుమిసిలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:50 గంటలకు శాంతిపురం మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ దగ్గరకు రోడ్డు మార్గాన చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
ఇక సాయంత్రం 4:35 గంటలకు తిమ్మరాజుపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఏడాదిగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు వివరించనున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఇక రాత్రి 7:05 గం.లకు శాంతిపురం మండలంలోని సొంత ఇంటికి వెళ్లనున్నారు. రాత్రికి శివపురంలో ఉన్న ఇంట్లో బస చేయనున్నారు.
ఇది కూడా చదవండి: German: జర్మన్ యువరాజు హెరాల్డ్ గుండెపోటుతో మృతి.. త్వరలో బిడ్డకు జన్మనివ్వనున్న భార్య
రెండో రోజు సీఎం పర్యటన వివరాలు..
ఇక గురువారం ఉదయం 10:35 గంటలకు కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో టాటా డీఐఎన్సీ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:15 గంటల నుంచి అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు పార్టీ ముఖ్య నాయకులతో భేటీ అవుతారు. సాయంత్రం 4:10 గంటలకు హెలిపాడ్ నుంచి తిరుగుప్రయాణం అవుతారు.
ఇది కూడా చదవండి: Donald Trump: అతి తక్కువ సుంకాలతో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం..