వెలగపూడిలోని సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ సుదీర్ఘంగా కొనసాగింది. 11 గంటల పాటు సమావేశం సాగింది. కలెక్టర్లు, ఎస్పీలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేనన్నారు.
రెవెన్యూ శాఖపై రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల భద్రతపై సిసోడియా ఆందోళన వ్యక్తం చేశారు. అనుమానస్పద రిజిస్ట్రేషన్లపై కలెక్టర్లు విచారణ జరిపించాలని సిసోడియా తెలిపారు. భూ రికార్డులను భద్రపరిచాలి.. రెవెన్యూ కార్యాలయాల్లో, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో డాక్యుమెంట్లను జాగ్రత్త చేయాలని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా పేర్కొన్నారు.
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో వాలంటీర్లకు ఇచ్చిన హామీకి ఎన్‌డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
వెలగపూడిలోని సచివాలయంలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. వివిధ సంక్షేమ శాఖలపై ఆయా శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సివిల్ సప్లైస్ శాఖ సమీక్ష ప్రారంభించే ముందు కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఆసక్తికర సంభాషణ జరిగింది. చాలా దూరంగా కూర్చున్నావ్.. ప్రత్యేకంగా సీటు వేయాలా..? అంటూ ఆ శాఖ కార్యదర్శి సిద్దార్ధ్ జైన్‌ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కామెంట్ చేశారు.
రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం పోర్టుల నిర్మాణాన్ని ఈపీసీ పద్దతుల్లో చేపట్టిందని చంద్రబాబు అన్నారు.పోర్టులను నిర్మించే కంపెనీలకు ప్రభుత్వం గ్యారెంటీలు ఎక్కడ ఇవ్వగలదని ఆయన పేర్కొన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన నేడు ఆప్కాబ్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, మత్స్యశాఖ అధికారులు హాజరుకానున్నారు. రైతులకు రుణాలు అందజేత అంశంపై సమీక్షించనున్నారు. అయితే.. బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆప్కాబ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో అక్రమంగా దారి మళ్లించిన సహకార సంఘాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. అధికారులే బినామీ…
“తల్లి పాలివ్వడాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలను బలోపేతం చేయడానికి, ప్రతి ఏడాది ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా "అంతరాలు లేకుండా అందరికీ తల్లిపాల మద్దతు" అనే థీమ్‌తో నిర్వహిస్తున్నామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు.
పెద్దలకు టీబీ బీసీజి టీకాలు వేయడంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఈ టీకాలు వేసినప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ గుర్తింపు సంఖ్యను కూడా ఏఎన్ఎంలు క్రియేట్ చేయాలన్నారు. మంగళగిరి ఏపీఐఐసీ టవర్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం జాతీయ టీబీ నిర్మూలనా కార్యక్రమంపై సమీక్షించారు.