పారిశ్రామిక పాలసీ రూపకల్పనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దేశంలో టాప్ 5 రాష్ట్రాలతో పోటీపడేలా కొత్త పారిశ్రామికాభివృద్ధి విధానం ఉండాలని అధికారులను ఆదేశించారు. పాలసీ రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించారు. జైలులో ఖైదీల సౌకర్యాలు పరిశీలించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైలులో స్నేహ బ్లాక్ వద్దకు వెళ్లాక మంత్రి ఎమోషనల్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు 53రోజులు ఇదే రాజమండ్రి జైలులో ఉంచారు. ఎలాంటి తప్పు చేయకుండా చంద్రబాబును జైలులో పెట్టారని నాటి పరిస్థితి గుర్తు చేసుకొని ఆవేదన చెందారు.
ఏపీలో టీడీఆర్ బాండ్ల స్కాం సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. తణుకులో టీడీఆర్ స్కాంపై ఏసీబీ ఇచ్చిన నివేదికను సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నారాయణ తీసుకెళ్లారు. తణుకు టీడీఆర్ బాండ్ల స్కాం జరిగిన తీరును ముఖ్యమంత్రికి వివరించారు. టీడీఆర్ స్కాంపై మరింత లోతుగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
Chandrababu Naidu: నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది. తెలంగాణాలో పార్టీ పునర్నిర్మాణం పై చర్చ జరిగింది., ప్రస్తుతం ఉన్న పార్టీ పదవులు అన్ని రద్దు చేసినట్లు.., రాష్ట్ర నూతన అధ్యక్ష ఎన్నికకు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. గ్రామ స్థాయిలో సభ్యత్వాల నమోదు కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు సూశించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేలా పని చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. Sheikh Hasina: షేక్…
రవాణా శాఖలో ప్రక్షాళనకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ.. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను తప్పిస్తూ బిల్లు పెట్టనుంది.
ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా బేసిన్లో ఎగువున ఉన్న ప్రాజెక్టులు గరిష్ట నీటి మట్టానికి చేరుకున్నాయి. దిగువ ప్రాజెక్టుల వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. కొన్నేళ్లుగా నీటి కొరతను ఎదుర్కొన్న ఏపీలో ఇప్పుడు కృష్ణమ్మ ఉగ్రరూపం భయపెడుతోంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తమను టార్గెట్ చేస్తున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కేవలం వారికి సంబంధించిన పత్రికల్లో అవాస్తవాలు ప్రచురించి ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదేళ్ల తర్వాత అన్న క్యాంటీన్లు ప్రారంభంకానున్నాయి. గతంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ మేరకు సమాచారం అందించారు. రాబోయే మూడు వారాల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు ఆయన గతంలో తెలిపిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే చల్లారుతోంది. తాజాగా రాజకీయ పార్టీలకు మళ్లీ పరీక్ష మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ వైసీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.