AP Liquor Shops Lottery: ఏపీలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీకి అనుగుణంగా నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 26 జిల్లాల పరిధిలో మొత్తం 3,396 మద్యం దుకాణాలకు రాష్ట్రవ్యాప్తంగా 89,882 దరఖాస్తులు రాగా.. లాటరీ విధానాన్ని సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కాగా.. పూర్తి బందోబస్తు నడుమ నిర్వహించిన ఈ లాటరీ కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలను తలపించింది. ఉదయం నుంచి నిరాటంకంగా జరిగి లాటరీ విధానాన్ని మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి అయింది. కాగా లాటరీ కొందరి పంట పండింది. వేసిన లాటరీల్లో చాలా మందికి షాపులు రాగా.. వారు ప్రస్తుతం నగదు సమీకరణ పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా.. మద్యం దుకాణాల లాటరీలో బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు పంట పండింది. ఆయన ఏకంగా ఐదు దుకాణాలను దక్కించుకున్నారు. ఇవాళ పుట్టపర్తిలో కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో లాటరీ తీయగా.. ధర్మవరం మున్సిపాలిటీలో దుకాణం 1, 4.. ధర్మవరం రూరల్‌లో 12, ముదిగుబ్బ మండలంలో 19, బత్తలపల్లి మండలంలో 14వ నంబర్ దుకాణాలు ఆయనకు దక్కాయి. ఒక్కరికే ఐదు దుకాణాలు దక్కడం గమనార్హం.
Read Also: CM Chandrababu: అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం