ఇవాళ శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.. రేపటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు.. మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
ఇవాళ ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. కొన్ని కీలక శాఖలకు సంబంధించి సమీక్ష.. జీఎస్డీపీపై సమీక్ష నిర్వహించే అవకాశం
ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 9.10 గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి ఎయిర్ పోర్టుకు బయలుదేరి 9.30 గంటలకు చేరుకోనున్న జగన్.. మధ్యాహ్నం 12.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్న జగన్
నేడు గిద్దలూరు, కంభం మార్కెట్ యార్డు చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం.. అనంతరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు
ఉదయం 10 గంటలకి కోవూరు పీఎస్‌లో విచారణకు హాజరుకానున్న మాజీ మంత్రి అనిల్.. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని వ్యక్తిగతంగా దూషించిన కేసుల్లో A2గా అనిల్.. గత నెల 31న జరగాల్సిన విచారణ వైఎస్ జగన్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఇవాల్టికి వాయిదా
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు రోజుల పర్యటన.. పాడేరు, అరకు నియోజకవర్గాల్లో రేషన్ షాపుల పనితీరు పరిశీలించనున్న మంత్రి
నేడు నర్సరావుపేటలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పర్యటన.. కార్యకర్తలతో విసృతస్థాయి సమావేశం, మేధావులతో సదస్సులో పాల్గొనున్న మాధవ్
కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు
నేడు రైతాంగ సమస్యలపై రాజమండ్రి కలెక్టరేట్ ఎదుట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన.. జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేయనున్న మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ.. కేసులో ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణమోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ
నేడు మల్కాపూర్‌లో సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.. సమావేశానికి హాజరుకానున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
రేపు ఉదయం 11 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రొడ్యూసర్స్ అత్యవసర సమావేశం.. ఫెడరేషన్ 30% వేతనాల పెంపును డిమాండ్ చేసిన నేపథ్యంలో అత్యవసర సమావేశం
నేడు భారత్, ఇంగ్లాండ్ మధ్య అయిదో టెస్టు అయిదో రోజు ఆట.. రసవత్తర ముగింపు దిశగా మ్యాచ్.. భారత్ గెలవాలంటే 4 వికెట్లు, ఇంగ్లాండ్ గెలవాలంటే 35 పరుగులు