మనం కూడా మంచి ఫలితాలు సాధించాలి: కొన్ని దేశాలు వ్యర్ధాలతో అద్భుతాలు చేస్తున్నాయని, ఏపీలో కూడా ‘స్వచ్ఛ దివాస్’ కార్యక్రమంతో మంచి ఫలితాలు సాధించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2048 నాటికి రాష్ట్రం అద్భుతమైన పురోగతి కోసం కృషి చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అని, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ…
తిరుమల భక్తులకు అలర్ట్: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేయనుంది. స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవకు సంబంధించి ఏప్రిల్ కోటా టికెట్లను జనవరి 18న ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. టికెట్ల కోసం జనవరి 18 నుంచి 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో…
నేటి నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కిడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేడు మైదుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 10:30కు ఉండవల్లి నివాసం నుండి 11:05 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు కెఎస్సి కళ్యాణ…
ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు లేదని మంత్రి రామానాయుడు అన్నారు. అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి జగన్ కూడా కారణం అన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఏపీలో పర్యటించనున్నారు. శనివారం రాత్రికి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు రానున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మైదుకూరులో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
1.25 కోట్లు గెలిచిన కోడిపుంజు: సంక్రాంతి పండగ వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంబరాల్లో మునిగిపోతారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిండివంటలూ, రంగవల్లులతో పాటుగా కోడిపందేలతో తెగ ఎంజాయ్ చేస్తారు. ఈసారి కోస్తాంధ్ర మాత్రమే కాదు.. రాయలసీమలోనూ కోడిపుంజులు తొడకొట్టాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన కోటి రూపాయల కోడి పందెం గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తాజాగా మరో కోడి పందెంకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఓ…
మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత: బుధవారం సాయంత్రం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అతడిని అడ్డుకున్నారు. తాత, నానమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి? అంటూ పోలీసులను మనోజ్ ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ లోపలికి వెళ్లనీయకపోవడంతో మోహన్ బాబు బౌన్సర్లతో మనోజ్…
తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తిరుమలకు వెళ్లాడు. కాలినడకన కొండపైకి వెళ్లిన ఆయన మోకాళ్లపై మెట్లు ఎక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను నితీశ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆస్ట్రేలియాతో బీజీటీ సిరీస్‌లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఇవాళ తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నాడు.