కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ అమిత్‌కు స్వాగతం పలికారు. సుమారు గంటకు పైగా సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షా ఉండనున్నారు. పలు కీక అంశాలపై వీరి మధ్య చర్చ జరగనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధుల కేటాయించినందుకు కేంద్ర మంత్రిని డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి సత్కరిస్తారు. మొదట కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర హోం శాఖ పరిధిలో ఉన్న విభజన సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. తర్వాత జాతీయ రాజకీయాలు ఏపీలో కూటమి పాలనపై చర్చ ఉండనున్నట్లు సమాచారం.
READ MORE: Vayve Eva Solar Car: సోలార్ పవర్‌తో నడిచే కారు వచ్చేసింది.. ధర రూ. 3 లక్షలు మాత్రమే!
ఇదిలా ఉండగా.. ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఏపీ బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. ఉదయం 11:30 గంటలకు కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరుకు చేరుకుంటారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సౌత్ క్యాంపస్‌ను ప్రారంభిస్తారు. కాగా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కి రూ.11,400 కోట్లు ప్రకటించిన మరునాడే పర్యటనకు రావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.