మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ ఎగిరింది. ఈ రోజు మధ్యాహ్నం 1గం.30 నిమిషాలు నుంచి 1గం.50 నిమిషాల మధ్య డ్రోన్ ఎగిరింది. నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం భవనంపై డ్రోన్ ఎగరడం కలకలం సృష్టించింది. భద్రతాపరమైన కారణాలను దృష్టిలో ఉంచుకుని గుర్తు తెలియని డ్రోన్ ఎగిరిన విషయంపై డీజీపీ కార్యాలయానికి సమాచారం అందించారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది సమాచారమిచ్చారు. అదే విధంగా గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకి కూడా తెలిపారు. అదే విధంగా ఇటీవల బుక్ ఫెస్టివల్ ప్రారంభానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ స్టాల్స్ దగ్గర ఉండగా విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.
READ MORE: Tollywood : పొంగల్‌కు వచ్చిన ప్రతిసారి హిట్టు కొట్టిన బడా నిర్మాత
కాగా.. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం కనిపించింది. దీంతో ఐపీఎస్ యూనిఫారంతో వచ్చిన సూర్య ప్రకాష్ అనే వ్యక్తిని విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడ్ని విజయనగరం జిల్లా ముడిదాం ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. కాగా, గత ఏడాదే ఐపీఎస్ కు సెలక్ట్ అయ్యానని స్థానికులకు చెప్పిన సూర్యప్రకాస్.. ట్రైనింగ్ లో ఉండి పవన్ కళ్యాణ్ పర్యటన కోసం వచ్చానని ఆ వ్యక్తి చెప్పాడు.
READ MORE: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు.. ఛత్తీస్‌గఢ్‌లో నిందితుడి అరెస్ట్..