కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించి.. ఏపీ బీజేపీ కొత్త సారథిపై చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. నేడు దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఏపీ సీఎం ఇవాళ అర్ధరాత్రి ఢిల్లీ నుంచి జ్యురిచ్ బయలుదేరనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో నాలుగు రోజుల పాటు ఆయన పాల్గొననున్నారు. రాజమండ్రి సత్యసాయి గురుకులంలో సాయంత్రం 5 గంటలకు మహా సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత…
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ అమిత్‌కు స్వాగతం పలికారు. సుమారు గంటకు పైగా సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షా ఉండనున్నారు. పలు కీక అంశాలపై వీరి మధ్య చర్చ జరగనుంది.
మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ ఎగిరింది. ఈ రోజు మధ్యాహ్నం 1గం.30 నిమిషాలు నుంచి 1గం.50 నిమిషాల మధ్య డ్రోన్ ఎగిరింది. నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం భవనంపై డ్రోన్ ఎగరడం కలకలం సృష్టించింది.
తొక్కిల లాంట, లడ్డూ కౌంటర్లలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలపై కేంద్రం సీరియస్ అయ్యింది. టీటీడీ బోర్డును కేంద్రం నివేదిక కోరింది. టీటీడీ చరిత్రలో కేంద్రం ఇలా జోక్యం చేసుకోవడం ఇదే మొదటి సారి. క్షేత్రస్థాయి పరిశీలనకు హోం శాఖ అధికారి సంజీవ్‌కుమార్ జిందాల్‌ను ప్రత్యేకంగా నియమించింది. రేపు, ఎల్లుండి రెండ్రోజులు సంజీవ్ జిందాల్ పర్యటించి వివరాలు సేకరించనున్నారు. టీటీడీ కూడా ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
స్వచ్ఛ భారత్ లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యమైన అవసరమని.. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇల్లు బాగు చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించవచ్చన్నారు. మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. ఆ తర్వాత మీ ఇంటి చుట్టూ పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. "ప్రతి నెల మూడవ శనివారం ఏ పని అవసరం లేదు.. మనల్ని మనం బాగు చేసుకోవాలి. పర్యాటకులు మోసం చేస్తే రారు, పరిశుభ్రంగా లేకుంటే రారు, హత్యలు చెస్తే…
అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశం మొత్తం ఒక స్ఫూర్తితో అడుగులు ముందుకు వేయాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మున్సిపాలిటీలలో స్వచ్ఛతగా ముందుకు వెళ్లలేకపోయామని వెల్లడించారు. కడపలో మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. "ఇతర దేశాలలో రోడ్లపై చెత్త వేయరు.. ఇంటికెళ్లి డస్ట్ బిన్ లో వేస్తారు..
చంద్రబాబు గత పరిపాలనలో పేదలకు సెంటు భూమి ఇచ్చిన చరిత్ర లేదని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు.. గత వైసీపీ హయంలో 30.6 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు.. జగన్ పేదల ఇళ్ల స్థలాల కోసం 15 వేల కోట్లతో భూములు కొనుగోలు చేశారన్నారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా పేదల స్థలాల కోసం ఇంత ఖర్చు చేయలేదన్నారు..
వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధుడు... వృద్ధురాలు.. ఒకరిని ఒకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. రాజమండ్రి లాలాచెరువు వద్ద స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఈ అరుదైన వివాహం జరిగింది. వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన 68 ఏళ్ల గజ్జల రాములమ్మ... రాజమండ్రి నారాయణపురానికి చెందిన 64 ఏళ్ల మూర్తి మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు.
తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు ఎత్తివేతపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు మీడియా ముసుగులో పదే పదే విష ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. 11 సీట్లకు వైసీపీని ప్రజలు పరిమితం చేసిన ఆ పార్టీ నాయకుల బుద్ధి మారలేదన్నారు.