కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించి.. ఏపీ బీజేపీ కొత్త సారథిపై చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు.
నేడు దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఏపీ సీఎం ఇవాళ అర్ధరాత్రి ఢిల్లీ నుంచి జ్యురిచ్ బయలుదేరనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో నాలుగు రోజుల పాటు ఆయన పాల్గొననున్నారు.
రాజమండ్రి సత్యసాయి గురుకులంలో సాయంత్రం 5 గంటలకు మహా సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికిపాటి నరసింహారావు ప్రవచనం చేయనున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత వసంతాల వేడుకల్లో మొట్టమొదటి కార్యక్రమంగా ఈ ప్రవచనం చేయనున్నారు.
నేటితో తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. పది రోజుల వ్యవధిలో 6 లక్షల 80 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.
నేడు విశాఖ GVMC గాంధీ విగ్రహం దగ్గర కమ్యూనిస్టు పార్టీల నిరసన కార్యక్రమం జరగనుంది. స్టీల్ ప్లాంటుకు సొంతగనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని, స్టీల్ ప్లాంట్‌ను అమ్మే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేయనున్నారు.
ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి, గాలివీడు మండలాలలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించనున్నారు.
నేటి నుంచి సిద్దిపేట జిల్లాలోని కొమురవెళ్లి మల్లికార్జున స్వామి జాతర ఆరంభం కానుంది. రెండు నెలల పాటు మల్లికార్జున స్వామి ఉత్సవాలు జరగనున్నాయి.
నేడు ఖమ్మం జిల్లాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భట్టి శంఖుస్థాపన చేయనున్నారు.
సింగపూర్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. నిన్నటి పర్యటనలో తెలంగాణలో రూ.3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలీమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది.
5 టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆడేందుకు భారత్, ఇంగ్లాండ్ జట్లు శనివారం కోల్‌కతాకు చేరుకున్నాయి. నేటి నుంచి ప్రాక్టీస్ మొదలెట్టనున్నాయి.
ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ సహా ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో భాగంగా నేడు కీలక మ్యాచులు జరగనున్నాయి.