స్వచ్ఛ భారత్ లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యమైన అవసరమని.. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇల్లు బాగు చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించవచ్చన్నారు. మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. ఆ తర్వాత మీ ఇంటి చుట్టూ పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. “ప్రతి నెల మూడవ శనివారం ఏ పని అవసరం లేదు.. మనల్ని మనం బాగు చేసుకోవాలి. పర్యాటకులు మోసం చేస్తే రారు, పరిశుభ్రంగా లేకుంటే రారు, హత్యలు చెస్తే రారు.. పరిశుభ్రంగా ఉంటే పర్యాటకులు వస్తారు. ప్రతి ఇంటి వద్ద చెత్త కలెక్ట్ చేశారా లేదా అనేదానికి క్యూఆర్ కోడ్ పెడతాం. పొడి తడి చెత్తలను వేరువేరుగా కలెక్ట్ చేస్తాం. చెత్త నుంచి ఆదాయం పొందడంపై అందరూ దృష్టి సారించాలి. చెత్త నుంచి విద్యుత్ బయోగ్యాస్ వంటివి తయారు చేయవచ్చు. ఇది నాకు నచ్చిన పని నేను మనసుపెట్టి పని చేస్తా. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. 2025 అక్టోబర్ లోపల ఇది పూర్తి చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. ఒకపక్క గాలి కలుషితం అవుతోంది, మరోపక్క తాగే నీరు కలుషితం అవుతోంది” అని సీఎం తెలిపారు.
READ MORE: Samsung Galaxy M35 5G: రూ. 24 వేల సామ్‌సంగ్ ఫోన్.. రూ. 14 వేలకే.. మతిపోయే ఫీచర్లు
ఇంటింటికి వెళ్లి చత్త సేకరణ చేపట్టాలని మున్సిపల్ పరిపాలన విభాగాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. “భారతదేశం మొత్తం స్వచ్ఛభారతవైపు అడుగులు వేస్తోంది మనం మొదటి స్థానంలో ఉండాలి. నేను ఎక్కడికి వచ్చి వెళ్లినా మార్పు కనపడాలి. అదే సిబీఎన్ మార్క్. మీ ఇంటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసుకోండి. సోలార్ ప్లాంట్ మీ ఇళ్లపై నిర్మించుకుంటే భారీగా సబ్సిడీ ఇస్తా..
విద్యుత్ వాడకం వల్ల పెట్రోల్ భారం తగ్గుతుంది.. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడానికి కృషి చేస్తా. ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన సబ్సిడీ ఇస్తా. ఇంటర్నెట్ పెట్టుకోవాలి. రాబోవు రోజుల్లో మీ సెల్ ఫోన్ నుంచి ఏ పని కావాలన్నా వాట్సప్ గవర్ననెన్స్ తీసుకొస్తున్న… వాట్సప్ ద్వారా మీ ఇంటి వద్ద నుంచే మీకు సేవలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్న.. మైదుకూరులో వీధిలైట్లు ఏర్పాటు చేస్తాం. మైదుకూరును ఓ మోడల్ టౌన్ గా తీర్చిదిద్దుతా. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయితే రౌడీలదే రాజ్యమవుతుంది. అలాంటి రౌడీలు రాకూడదనే నా కోరిక. కడపలో ముఠాలు లేకుండా చేసాం. ప్రజా చైతన్యం పెరిగితే మెరుగైన ఫలితాలు వస్తాయి.” అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.