అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశం మొత్తం ఒక స్ఫూర్తితో అడుగులు ముందుకు వేయాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మున్సిపాలిటీలలో స్వచ్ఛతగా ముందుకు వెళ్లలేకపోయామని వెల్లడించారు. కడపలో మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. “ఇతర దేశాలలో రోడ్లపై చెత్త వేయరు.. ఇంటికెళ్లి డస్ట్ బిన్ లో వేస్తారు.. గతంలో నేను ఏ ఊరికి వెళ్ళినా మరుగుదొడ్లు రోడ్డు సైడ్, చెత్త కుప్పలు కుప్పలుగా స్వాగతం పలికేవి… సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను సీఎంగా ఉన్న సమయంలో ప్రతి ఆడబిడ్డకు మరుగుదొడ్లు కట్టించా.. మహిళల ఆత్మగౌరవం నిలిపేందుకు మరుగుదొడ్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టా. ఆడబిడ్డ వంట చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. వర్షం వస్తే వంట చేయాలంటే నరకయాతన అనుభవించేవారు. ప్రతి ఆడబిడ్డ వంట చేయడం కోసం గ్యాస్ కనెక్షన్ ఇచ్చా. భారతదేశాన్ని స్వచ్ఛభారత్ గా మార్చాలని ప్రధాని ముఖ్యమంత్రిల సమావేశం నిర్వహించారు. దేశ విదేశాలు తిరిగి ప్రధానికి పరిశుభ్రతపై సమగ్రమైన నివేదిక ఇచ్చా.. సమాజ హితం కోసం పనిచేసిన వారిని మనం గుర్తించాలి.. ప్రతి నెల మోడల్స్ శనివారం అందరం కలిసి స్వచ్ఛ్ ఆంధ్ర ప్రదేశ్ కోసం కృషి చేయాలి అని నిర్ణయించాం.” అని సీఎం వెల్లడించారు.
READ MORE: Aero India Show: ఎయిర్ షో జరుగుతున్న ప్రాంతంలో మాంసం షాపులు, హోటళ్లు బంద్.. కారణం..?
మూడవ శనివారం ప్రతి ప్రభుత్వ కార్యాలయం ప్రతి పాఠశాల స్వచ్ఛ ఆంధ్ర పై శ్రద్ధ పెట్టాలని చంద్రబాబు సూచించారు.. ప్రజలలో అనునిత్యం చర్చ జరిగితే తప్ప ఇది సాధ్యం కాదన్నారు. స్వచ్ఛ ఆంధ్రలో ఐదు ప్రిన్సిపల్స్ పెట్టినట్లు తెలిపారు.”స్వచ్ఛ భారత్ లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యమైన అవసరం.. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఇల్లు బాగు చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించవచ్చు. మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత మీ ఇంటి చుట్టూ పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలి. ప్రతి నెల మూడవ శనివారం ఏ పని అవసరం లేదు.. మనల్ని మనం బాగు చేసుకోవాలి. పర్యాటకులు మోసం చేస్తే రారు, పరిశుభ్రంగా లేకుంటే రారు ,హత్యలు చేస్తే రారు.. పరిశుభ్రంగా ఉంటే పర్యాటకులు వస్తారు. ప్రతి ఇంటి వద్ద చెత్త కలెక్ట్ చేశారా లేదా అనేదానికి క్యూఆర్ కోడ్ పెడతాం. పొడి తడి చెత్తలను వేరువేరుగా కలెక్ట్ చేస్తాం. చెత్త నుంచి ఆదాయం పొందడం పై అందరూ దృష్టి సారించాలి. చెత్త నుంచి విద్యుత్ బయోగ్యాస్ వంటివి తయారు చేయవచ్చు.” అని చంద్రబాబు తెలిపారు.
READ MORE: Manchu Vishnu : శివుని ఆజ్ఞతోనే ‘కన్నప్ప’ చిత్రం రూపుదిద్దుకుంటోంది