పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. వికసిత్ భారత్ వైపు నడిపించేలా కేంద్ర బడ్జెట్ ఉందంటూ కితాబు ఇచ్చారు. ఏపీకి అమూల్యమైన ప్రోత్సాహం ఇస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మన దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉందని.. రైతులు, మహిళలు, మధ్యతరగతి, యువత… ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకున్నారని చెప్పారు. 10 లక్షల విలువైన క్రెడిట్ కార్డులు మంజూరు చేయడం వల్ల సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు ఊతం ఇచ్చినట్లు అయిందని పేర్కొన్నారు. 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.2 కోట్ల రుణాలతో ఆ వర్గాల మహిళల ఆర్థిక స్వావలంబన జరుగుతుందన్నారు. రూ.12 లక్షల వరకూ వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు మూలంగా ఉద్యోగ వర్గాలకు ఎనలేని ఊరట లభించిందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Ultraviolette SuperStreet: దుమ్మురేపే ఫీచర్లతో సూపర్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ తో 323KM రేంజ్!
‘‘పీఎం ధన్ ధాన్య యోజన మూలంగా వెనకబడ్డ జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం. కిసాన్ కార్డుల పరిమితి రూ.5 లక్షలకు పెంచడం స్వాగతించదగ్గ అంశం. పోలవరం ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేసే అవకాశం లభించింది. పోలవరం ప్రాజెక్ట్‌కి రూ.5,936 కోట్లు, బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్లు ప్రకటించడం శుభపరిణామం. కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుంది. విశాఖ ఉక్కు పరిశ్రమకి రూ.3,295 కోట్లు కేటాయించడం ద్వారా ఆ ప్లాంట్ పరిరక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు నిధులు ఇవ్వడం ద్వారా పోర్టు సామర్థ్యం పెరుగుతుంది.’’ అని పవన్‌కల్యాణ్ అన్నారు.
ఇది కూడా చదవండి: Delhi Polls: ఎన్నికల ముందు ఆప్‌కి భారీ షాక్.. బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు..