ఏపీ వ్యాప్తంగా ఏసీబీ అధికారుల బృందాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మెరుపు దాడులు నిర్వహిస్తున్నాయి. విజయవాడ ఇబ్రహీంపట్నం, పలనాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి రేణిగుంట, విజయనగరం భోగాపురం, విశాఖ మధురవాడ, ఒంగోలు, కర్నూలు కడప వంటి అన్ని ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులు పనిచేయడంతో పాటు ఏజెంట్లు సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది కొమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని అంశాల మీద విచారణ చేస్తున్నారు. కార్యాలయాల తలుపులు మూసి లోపల రికార్డులు పరిశీలిస్తున్నారు.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది, దస్తావేజుల విభాగంలో లావాదేవీలపై సమగ్రంగా తనిఖీలు చేపట్టారు. అధికారుల నుంచి పలు రికార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. లంచం, అక్రమ రిజిస్ట్రేషన్లపై వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న సబ్ రిజిస్టర్ ఆనంద రెడ్డిపై అవినీతి తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు ఏసీబీ అధికారులు రాగానే డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు. ఏసీబీ అధికారులు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు ఏసీబీ అధికారులు రాగానే డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు. ఏసీబీ అధికారులు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Nigar Sultana: జూనియర్లను గదిలోకి పిలిచి.. బంగ్లా కెప్టెన్‌పై సీనియర్ పేసర్ ఆరోపణలు!
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు రికార్డ్స్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు కార్యాలయంలో అవినీతి జరిగినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయని, అందులో భాగంగా ఇక్కడ కూడా తనిఖీ చేస్తున్నాం అని చెప్పారు.