YS Jagan: డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జోగి రమేష్ అరెస్ట్
- జోగి రమేష్ అరెస్ట్ను ఖండించిన వైఎస్ జగన్..
- డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జోగి రమేష్ను అరెస్ట్ చేశారు..
- తొక్కిసలాట, తుఫాన్లో ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ అరెస్ట్..
- కల్తీ మద్యం కేసులో పట్టుబడ్డవారిలో అంతా టీడీపీ వాళ్లే: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్ అరెస్ట్ పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. చంద్రబాబు అండ్ కో నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడటంతో అడ్డంగా దొరికిపోయారు.. దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు.. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు.. జోగి రమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.. గత 18 నెలలుగా ప్రభుత్వం మీది పాలన మీది.. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది.. పట్టుబడ్డ వారిలో మీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు, మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ, అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే అని జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.
Read Also: NBK 111 : బాలయ్య సరసన ‘యువరాణి’ని ప్రకటించేందుకు ముహూర్తం ఫిక్స్..
Also Read
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
ఇక, మీరు తయారు చేసిన నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టు షాపుల్లోనే, పర్మిట్ రూముల్లోనే అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. తయారీ మీది, చేసిన వారు మీవారు, అమ్మేదీ మీరే, కాని బురద జల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లనా అని ప్రశ్నించారు. నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి, మొంథా తుఫాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కదోవ పట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడ్డారని విమర్శించారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటిరోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతూందని మాజీ సీఎం జగన్ తెలిపారు.
Read Also: Lavanya-Varun Tej : యానివర్సరీ సెలబ్రేషన్స్ లో.. లావణ్య వరుణ్ స్పెషల్ పోస్ట్
అయితే, నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు చేయించడానికి భయమెందుకు చంద్రబాబు? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?.. మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెప్తే అది చేస్తుంది.. మీరు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్.. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? అని ఎద్దేవా చేశారు. ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
-
Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
-
Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ ‘బాహుబలి’ వీడియో షేర్ చేసి..!
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!