నేడు ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. ఉదయం 10గంటలకు ఈ ఫలితాలను రిలీజ్ చేయనున్న మంత్రి నారా లోకేశ్
నేడు రాయచోటి ప్రాంతంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటన.. పలు కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
నేడు, రేపు వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌ను విచారించనున్న నగరంపాలెం పోలీసులు.. ఐటీడీపీ నేత చేబ్రోలు కిరణ్ పై దాడి కేసులో రెండు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు ఉత్తర్వులు
నేడు తునిలో ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన.. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులపై అన్నవరంలో అధికారులతో రివ్యూ, ప్రెస్ మీట్
నేడు కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ అవిశ్వాస తీర్మానం.. మున్సిపల్ చైర్ పర్సన్ నజిమున్నీసపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన మెజారిటీ వైసీపీ కౌన్సిలర్లు
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఒంగోలులో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు
ఇవాళ ఆన్‌లైన్‌లో జూలై నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టిక్కెట్లు విడుదల.. 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల
ఇవాళ ఒంగోలులో జిల్లా రివ్యూ కమిటీ సమావేశం.. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన డీఆర్సీ సమావేశం
నేడు రామగుండం నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం తలపెట్టిన సమావేశానికి హాజరుకానున్న కవిత
నేడు ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి పొంగులేటి
నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్.. ఏప్రిల్ 25న కౌంటింగ్
ఈరోజు వరంగల్ ఎల్కతుర్తి కి వెళ్లనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్లీనరీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించనున్న కేటీఆర్.. అక్కడే మీడియాతో మాట్లాడనున్న కేటీఆర్
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో సౌదీ నుంచి వచ్చేసిన ప్రధాని మోడీ.. ఈరోజు మోడీ అధ్యక్షతన భద్రతావ్యవహారాల కేబినెట్ మీటింగ్
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్.. ఉప్పల్ మైదానంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం