కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత ప్రాంతాలు మరొ కొన్ని రాష్ట్రాలు కూడా వారివారి రాష్ట్ర వ్యాట్‌ను తగ్గించాయి. అయితే ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రతి పక్షాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీ ప్రభుత్వం రాష్ట్ర సుంకాన్ని తగ్గించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఓ ప్రకటన…
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు పంపిణీకి జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామనే విషయాన్ని కరపత్రాల రూపంలో ప్రజలకు ప్రభుత్వం వివరించనుంది. ప్రణాళిక శాఖ దీనికోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరాల్ని ఇంటింటికి పంపిణీ చేయడానికి కసరత్తు పూర్తి చేసింది. ప్రభుత్వ పథకాలు స్టేటస్ రిపోర్టులు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లకు…
ఏపీ వ్యాప్తంగా రేపు బీజేపీ నిరసన చేపట్టేందుకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర సుంకం తగ్గించిన విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయానికి మద్దతుగా బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు మరొ కొన్ని రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర సుంకాన్ని తగ్గించాయి. ఈ నేపథ్యంలో ఏపీలోనూ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై సుంకాన్ని తగ్గించాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు.…
ఏపీలో ఎక్కడ వాహనాలు తనిఖీలు చేపట్టినా భారీగా గంజాయి దొరుకుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తమైన పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. అనుమాన వచ్చిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ కేంద్రంగా సుమారు 6 కోట్లు విలువ చేసే నిషేదిత గంజాయిని పట్టుకున్నట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. Read Also : వీడియో : స్కూటీపై టపాసులు తీసుకెళ్లుండగా పేలుడు.. తండ్రికొడుకులు దుర్మరణం.. ఈ నేపథ్యంలో గంజాయి రవాణాను అరికట్టేందుకు…
గురజాల అభివృద్ధిపై టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా అంటూ గురజాల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సవాల్ విసిరారు. గురజాలలో టీడీపీ ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించండి. దాచేపల్లి నడిసెంటర్లో అయినా సరే, బొడ్రాయి సెంటర్ లో అయినా సరే, చర్చకు నేను ఒక్కడినే వస్తా, లెక్కలు తేల్చుకొని వెళ్తా, టీడీపీ వారు సిద్ధమా’ అంటూ ఛాలెంజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకుంటున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని, మేము నిజంగా అడ్డుకుంటే ఇన్ని నామినేషన్లు…
రేపు ఏపీ బంద్‌కు రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. విజయనగరంలోని లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ ముందు చెరకు రైతులు బకాయిలు చెల్లించాలంటూ బుధవారం నిరసనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై రైతులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘర్ణణలో ఆరుగురు రైతులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో గురువారం రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రేపు ఏపీ బంద్‌కు పిలునిచ్చారు. రైతులందరూ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో కరానోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా రాష్ట్రంలో 36,373 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 301 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారనైంది. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో ఇద్దరు కరోనా బారినపడి మృతి చెందగా.. 367 మంది కరోనా నుంచి కొలుకున్నారు. ప్రస్తుతం రాష్రంలో 3,830 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
ఓ వార్డు వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వార్డు వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రవి కుమార్ అనే వ్యక్తి తాడేపల్లిలో నిన్నటి నుంచి కనిపించడం లేదు. అయితే రవికుమార్ ఈ రోజు నదిలో శవమై కనిపించాడు. దీంతో రవికుమార్ శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేయడంతో అతడు వాలంటీర్ రవికుమార్‌గా గుర్తించారు. అంతేకాకుండా అతడి వద్ద సూసైడ్ నోట్ కూడా లభ్యమైనట్లు పోలీసులు…
తిరుపతిలో నవంబర్ 14న జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరుగనుంది. అయితే కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో జగన్ సమావేశమయ్యారు. ఏపీ విభజన చట్టంలో పెండింగులో ఉన్న అంశాలు, తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టులో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, రూ. 6300 కోట్ల విద్యుత్బకాయిలు,…
జగన్ సర్కార్ ఆధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో అమరావతి అభివృద్ధికి భూములిచ్చి రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 45 రోజుల మహా పాదయాత్రకు రాజధాని రైతులు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్ర నవంబర్ 1 నుంచి ప్రారంభమైంది. నేడు రెండవ రోజు పాదయాత్రను ప్రారంభించనున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తాడికొండ నుండి గుంటూరు శివారు ప్రాంతం వరకు 12.6 కిలో మీటర్ల…