ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు పంపిణీకి జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామనే విషయాన్ని కరపత్రాల రూపంలో ప్రజలకు ప్రభుత్వం వివరించనుంది. ప్రణాళిక శాఖ దీనికోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరాల్ని ఇంటింటికి పంపిణీ చేయడానికి కసరత్తు పూర్తి చేసింది.
ప్రభుత్వ పథకాలు స్టేటస్ రిపోర్టులు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఏపీ ప్రణాళిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికి రెండు బ్రౌచర్ల రూపంలో ప్రభుత్వం పథకాల వివరాలను పంపిణీ చేయాలని ఆదేశించింది. ఆర్‌డీవో కార్యాలయానికి బ్రౌచర్లు చేరాక ప్రణాళికా బద్దంగా ఇంటింటికి పంపిణీ చేయాలని సూచనలు చేసింది.