కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత ప్రాంతాలు మరొ కొన్ని రాష్ట్రాలు కూడా వారివారి రాష్ట్ర వ్యాట్‌ను తగ్గించాయి. అయితే ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రతి పక్షాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ప్రజలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీ ప్రభుత్వం రాష్ట్ర సుంకాన్ని తగ్గించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఓ ప్రకటన చేశారు. ప్రజలకు మేలు చేకూర్చేలా ఓ మంచి నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని ఆయన అన్నారు. ఇంధన ధరలపై కేంద్రం నిర్ణయన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు.