ఈ నెలలో దేవి శరన్నవరాత్రోత్సవాలు విజయవాడ ఇంద్రాకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో వైభవోపేతంగా జరిగాయి. తొమ్మది రోజలు అమ్మవారు వివిధ అలంకరణలలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు దుర్గమ్మ ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహించారు. ఆలయ చైర్మన్ సోమినాయుడు, ఆలయ ఈవో భ్రమరాంబ సమక్షంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ మేరకు అమ్మవారి హుండీ ఆదాయం రూ. 2.87 కోట్లు వచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా బంగారం 546 గ్రాములు రాగ, 9.55 కిలోల…
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరసనగా రేపటి నుంచి రేషన్ షాపులకు బంద్కు పిలునిచ్చిన రేషన్ డీలర్లు వారి నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. కానీ.. ప్రభుత్వం స్పందించేంతవరకు ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని విజయవాడలో రేషన్ డీలర్ల సంఘం నేతలు ప్రకటించారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కమిషన్ బకాయిలు 2020 నుంచి చెల్లించడం లేదన్నారు. వాటితో పాటు గోనె సంచుల బకాయిలు చెల్లించడం లేదని, తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు ధర్నాలు నిర్వహిస్తామని…
ఏపీ సీఎం జగన్ మెహన్ రెడ్డి ఉన్నత విద్యపై విద్యాశాఖ అధికారులతో ఉన్నస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్లాంటి సంస్థలతో శిక్షణ నిరంతరం కొనసాగాలని ఆయన అధికారులను ఆదేశించారు. కోర్సుల్లో శిక్షణను ఇంటిగ్రేట్చేయాలి, విద్యాపరంగా మనం వచ్చిన తర్వాత తేడా ఏంటన్నది కనిపించాలని ఆయన అన్నారు. వీసీలు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి, ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలన్నారు. ఉన్నత విద్యలో అనేక మార్పులు తీసుకు వచ్చామని, డిగ్రీని నాలుగేళ్ల కోర్సు…
ఏపీలో రాజకీయ పరిస్థితులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో గాడి తప్పిందని ఆయన అన్నారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం దివాళా దిశగా సాగుతోందని, అప్పులు తీసుకువస్తే తప్పా రాష్ట్రానికి మనుగడలేని దుర్భర పరిస్థితిలు నెలకొన్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఇసుక, ఇటుక, ఉక్కు ధరలు పెరిగి సామాన్యుడికి అందని ద్రాక్షలా మారాయన్నారు. జగన్ ప్రభుత్వం తిరోగమన చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. ఎన్నికల్లో హామీలు గుప్పించిన జగన్…
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో బీజేపీ తరుఫున ప్రచారం చేసేందుకు కేంద్ర పశు సంవర్థక, మత్స్య, సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ రానున్నారు. తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బద్వేల్ కు కేంద్ర మంత్రి మురుగన్ చేరుకోనున్నారు. అనంతరం తొలుత పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకూ రోడ్ షోలో పాల్గొని, నాలుగు రోడ్ల కూడలిలో ఆయన ప్రసంగించనున్నారు.…
తిరుపతిలో అర్థరాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి వెస్ట్ చర్చ్ సమీపంలో ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద వాహనం నీట మునిగింది. దీంతో కర్ణాటకకు చెందిన ఏడుగురు భక్తులు వరద నీటిలో చిక్కుకున్నారు. అతికష్టం మీద ఆరుగురు వ్యక్తులు బయటపడ్డారు. కానీ సంధ్య అనే మహిళ ఊపిరాడక మృతి చెందింది. వీరితో పాటు ప్రయాణిస్తున్న బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వాహనం వదిలి డ్రైవర్ పరారైనట్లు సమాచారం. ఇప్పటికే వాతావరణ శాఖ…
విజయనగరం వైసీపీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయనగరం జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ అంబటి అనిల్ గుండె పోటుతో మృతి చెందారు. ఆయన సొంతూరు సాలూరు మండలం సన్యాసిరాజుపేట. జిల్లా పరిషత్ లో అందరి కన్నా చిన్న వయస్సున్న జడ్పీటీసీగా అనిల్ గుర్తింపు తెచ్చుకున్నారు. జిల్లా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే అనిల్ మృతి పట్ల జిల్లా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మేనల్లుడైన అంబటి అనిల్ మృతి పట్ల వైసీపీ…
ఏపీ ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్టు శుభవార్త చెప్పింది. ఈ రోజు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. సాయంత్రం 5 గంటలకు ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఫలితాల విడుదల అనంతరం ఈ నెల 26 నుంచి నవంబర్ 2వరకు రీ వాల్యూవేషన్, రీ వెరిఫికేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని బోర్టు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రీ వాల్యువేషన్ కు రూ.260, రీ వెరిఫికేషన్ కొరకు రూ.1300 చెల్లించాల్సి…
అనంతపురం జిల్లాలో దుర్ఘటన చోటు చేసుకుంది. తన పోలికలతో లేదని ఓ వ్యక్తి తనకు పుట్టిన శిశువు ప్రాణాలను బలిగొన్నాడు. ఈ హృదయవిదాకర ఘటన అనంతపురం జిల్లాలోని కళ్యాణ దుర్గంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కళ్యాణ దుర్గంలో నివాసం ఉంటున్న మల్లికార్జున్ కు రెండు నెలల క్రితం పాప పుట్టింది. అయితే పాపకు తన పోలికలు లేవని తరుచూ భార్యతో మల్లికార్జున్ గొడవు దిగేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యతో గొడవపడి…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. తాజాగా పేద బ్రహ్మణులకు ఆర్థిక సహాయం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పేద బ్రహ్మణుల అంత్యక్రియలకు ప్రభుత్వం గరుడ సహాయ పథకం కింద రూ.10 వేల ఆర్థిక సహాయం ఇవ్వనుంది. ఈ పథకానికి రూ.75 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులుగా పేర్కొంది. అంతేకాకుండా మరణించిన 40 రోజుల లోపు…