నెల్లూరును రెండు మూడు సంవత్సరాల్లో మార్చేస్తానని చెప్పాను.. అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నాను అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. ఐదారు వందల కోట్లు గ్రాంట్ రూపంలో తీసుకొని వచ్చాము. 100 కోట్లతో తో పెన్నా నది పై ఇంకో బ్రిడ్జి వస్తుంది ట్రాఫిక్ సమస్య మొత్తం తీరిపోతుంది. నేను ఎటువంటి పనులు చేశానో నెల్లూరు ప్రజలకు తెలుసు. సర్వేపల్లి కాలువ పక్కన 1,250 ఇళ్ళు ఉన్నాయి… అందులో 4,5 ఇళ్ల కే ప్రమాదం ఉంది… అందరికీ అండగా…
జగనన్న పచ్చతోరణంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. గ్రామాలను పచ్చదనంగా మారుస్తున్నాం అని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గ్రామాల్లో చెట్లను పెంచే బాధ్యతను సర్పంచులకు అప్పచెబుతున్నాం. సర్పంచులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు ఉంటాయి అని హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరుజిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నాం. దీంతో రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేస్తాం. నేను రైతును..రైతు కష్టాలు నాకు తెలుసు. మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. మామిడికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు. గత…
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రిలో మొక్కలు నాటారు రాష్ట్ర విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కరోనా నేపధ్యంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తి లేదు అన్నారు. అనుకూల పరిస్థితులు తరువాత పరీక్షలు నిర్వహిస్తాం. పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపక్ష పార్టీల డిమాండ్ సరికాదు. లోకేష్ చదువుకోవడానికి ఆ రోజుల్లో సత్యం కంప్యూటర్స్ సంస్థ ఉంది. పేద విద్యార్దులకు అటువంటి సహాకారం లేదు.…
వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన రాబోయే తరాలకు ఓ దిక్సూచి అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పార్టీలకు, రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా జగన్ మోహన్ రెడ్డి పాలన సాగుతోంది అని తెలిపిన ఆయన రెండేళ్లలో లక్షా 31వేల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమచేశాం అని పేర్కొన్నారు. రూపాయి లంచం లేకుండా జగన్ ఒక్క బటన్ నొక్కితే లబ్ధిదారులకు సంక్షేమం అందుతోంది. కోట్లాది మంది కష్టాలను స్వయంగా చూసిన వ్యక్తి సీఎం జగన్. మొన్నటి ఎన్నికల…
ఒంటి చేత్తో పోరాటం చేసి నేడు ప్రజా సంక్షేమానికి పీట వేసిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి కన్నబాబు తెలిపారు. ప్రజలు పార్టీని కోరుకుంటున్నారని స్థానిక ఎన్నికల ద్వారా తెలిపారు. కుల, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు. లక్ష 25 వేళా కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లకు అంద చేసారు. 96% మ్యానిఫిస్టులో పెట్టిన పతకాలు అమలు చేసిన మనిషి మన ముఖ్యమంత్రి… 16 మెడికల్ కాలేజీలకు సోమవారం శంకుస్థాపన…
రెండేల్ల పాలనలో సీఎం వైఎస్ జగన్ 94 శాతం హామీలు నెరవేర్చారు. అన్ని రంగాల్లో మహిళలకు సీఎం జగన్ ప్రాధాన్యత కల్పించారు అని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మంత్రి వర్గంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం కల్పించిన ఘనత సీఎం జగన్ దే. నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు సీఎం కల్పించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఆడపిల్లల డ్రాపవుట్లు తగ్గించిన ఘనత సీఎందే అని తెలిపారు. విద్యార్థినులు చక్కగా చదువుకునేందుకు…
ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన మేనిఫెస్టో లో ప్రతి అంశాన్ని నెరవేర్చేలా చర్యలు తీసుకున్నారు. మేనిఫెస్టో లో ఇచ్చి హామీల్లో నూటికి 94శాతం హామీలు సీఎం నెరవేర్చారు అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రతి లబ్దిదారుడికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో నగదు బదిలీ చేశారు. 2ఏళ్ల పాలనపై సీఎం విడుదల చేసిన పుస్తకాన్ని ప్రతి లబ్ది దారుడికి పంపిస్తాం. సంక్షేమం అభివృద్దిని రెండు కళ్లుగా ప్రభుత్వం భావిస్తోంది. వైఎస్…
యాస్ తుపాన్ ప్రభావిత జిల్లాల జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసారు మంత్రి ఆళ్ల నాని. తుపాన్ కదలికలపై ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించిన మంత్రి ఆళ్ల నాని… విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పశ్చిమగోదావరి తూర్పుగోదావరి జిల్లాల DMHO లు DCHS, హాస్పిటల్ సూపరింటెండెంట్స్ తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ ముందుగా సిద్ధం చేసుకోవాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి…
ప్రభుత్వాన్నీ అస్థిరపరచడం,బురద జల్లడమే చంద్రబాబు లక్ష్యం అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో లోకేష్ పర్యటనలో కరోనాతో మరణించిన పార్టీ నాయకులు కుటుంబాల పరామర్శ కోసం అని భావించాం. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి పరామర్శ పేరుతో వచ్చిన లోకేష్… రాజకీయం మాట్లాడి వెళ్లారు. లోకేష్ కు చరిత్ర తెలియదు… టీడీపీ హయాంలోనే కారంచేడులో దళితుల్ని ఊచకోత కోశారు. దళితుల గురించి మాట్లాడే హక్కు లోకేష్, చంద్రబాబుకి లేదు. టీడీపీ అన్ని వర్గాలను దూరం చేసుకున్నందుకే జగన్మోహన్…
అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి వైద్యం తప్పదు అని మంత్రి బుగ్గన అన్నారు. ఆయుర్వేదిక్, హోమియోపతి వేల సంవత్సరాల నుంచి వున్నా అత్యవసరంలో అల్లోపతి బెటర్ అని తెలిపారు. కోవిడ్ విషయంలో ప్రపంచం అనుసరిస్తున్న ప్రోటోకాల్ ఫాలో కావాల్సి వస్తుంది. కరోనాను ఏపీ ప్రభుత్వం అద్భుతంగా హాండిల్ చేస్తుంది. ప్రభుత్వం, అధికారులు కరోనాకట్టడికి నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రతిరోజు ప్రభుత్వం కరోనా పై సమీక్ష చేస్తుంది. కోవిడ్ నివారణకు ప్రజల సహకారం ముఖ్యం అని తెలిపిన మంత్రి బుగ్గన లక్షణాలు…