సీఎం ఆదేశాల మేరకు విమ్స్ ను సందర్శించాము. విమ్స్ ఏర్పాటు ప్రాధాన్యత రీత్యా చర్యలు తీసుకుంటున్నాం అని మంత్రి ఆళ్ల నాని అన్నారు. 400 ఆక్సిజన్ బెడ్స్ వున్నాయి..వీటిని ఆరు వందల బెడ్ లకు పెంచే ప్రతిపాదనలు చేశారు. ఆక్సిజన్ అందుబాటు బట్టి బెడ్ ల సంఖ్య పెంచే ఆలోచన వుంది. ఇప్పుడు విమ్స్ లో 10 టన్నుల ఆక్సిజన్ అందుబాటులో వుంది. ఈ ఆక్సిజన్ కోటా శాతం పెంచే ఆలోచనలు వున్నయి. విమ్స్ లో 20…
రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీగా గెలిచారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్ష. ముఖ్యమంత్రి జగన్ దయతోను, ఆయన పెట్టిన బిక్షతోనూ ఎంపీగా గెలుపొంది పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కరెక్ట్ కాదు అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మాట్లాడే భాష, తీరు, వ్యవహరించే విధానం ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణం ఒక్కటీ ఆయనకు లేదు. ఎంపీగా గెలిచి రెండేళ్లు కావొస్తున్నా ఆయన ప్రజలకోసం చేసిందేమీ లేదు. కరోనా సమయంలో…
చంద్రబాబు , టీడీపీ నేతలు ,ప్రతిపక్షాల పై మంత్రి అప్పలరాజు ఫైర్ అయ్యారు. ఏపీలో జరుగుతున్నంత నీచ రాజకీయాలు దేశంలో మరెక్కడాలేవు. రుయా ఆసుపత్రి ఘటన ప్రమాదవశాత్తూ జరిగింది. ముఖ్యమంత్రి రుయా ఘటన పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతగా ఉండాల్సిన టీడీపీ క్యాండిల్ నిరసన చేపట్టింది. చంద్రబాబుకు , టీడీపీ నేతలకు అసలు సిగ్గుందా… కడుపుకు అన్నం తింటున్నారా … గడ్డి తింటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. పుష్కరాల్లో సుమారు…
ఆక్సిజన్, రెమిడెసివర్, కోవిడ్ కేర్ సెంటర్లు వంటి అన్ని అంశాలు చర్చించాం. తిరుపతి రుయా హాస్పిటల్ సంఘటన పునరావృతం కాకుండా సీఎం కలెక్టర్లు అందరికీ ఆదేశాలు జారీ చేశారు అని మంత్రి ఆళ్ళ నాని అన్నారు. మొదటి దశలో వచ్చిన కేసుల కంటే రెట్టింపు సంఖ్య ఇప్పుడు వచ్చింది. మొదటి వేవ్ లో అత్యధికంగా 240 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. గతంలో 17 వేల ఆక్సిజన్ బెడ్లు ఉంటే సెకండ్ వేవ్ లో 11…
నెల్లూరులో కలెక్టర్ భవనంలో మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శేఖ మంత్రి అనీల్ మరియు జిల్లా కలెక్టర్ ,జిల్లా SP సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆక్సిజన్ కొరత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ… నేను, మేకపాటి ఈ మధ్య కరోనా నుండి కొలుకున్నాం. జిల్లలో ప్రతిపక్షం ఇంట్లో కూర్చొని కరోనా పై మాట్లాడటం విడ్డురంగా ఉంది. జిల్లాలో ఆక్సిజన్ , బెడ్లు కొరతలేవు. ప్రతిపక్షాలు ప్రభుత్వం…
కర్నూలు జిల్లాలో పోటాపోటీగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. మంత్రి సీదర అప్పలరాజుపై వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు నమోదయ్యింది. N 440 K వైరస్ కర్నూలు లో ఉన్నట్టు నిర్ధారణ అయిందని, ప్రమాదకరమైందని మంత్రి డిబేట్ లో చెప్పారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ ఫిర్యాదు చేసారు. ఇప్పటికే వన్ టౌన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు పై కేసు నమోదు అయ్యింది. కర్నూలులో ఎన్-440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై న్యాయవాది…
రాష్ట్రంలో, దేశంలో ఆక్సిజన్ కొరత భయంకరంగా ఉంది అని మంత్రి కొడాలి నాని అన్నారు. కావాలంటే రాష్ట్రంలో 2 లక్షల బెడ్లు ఏర్పాటు చేయగలం? వీటికి ఆక్సిజన్ ఎవరు ఇస్తారు? కేంద్రం నుంచి తగిన కావాల్సిన స్థాయిలో ఆక్సిజన్ రావటం లేదు అని తెలిపారు. 380 టన్నుల ఆక్సిజన్ కావాలని కేంద్రాన్ని అడిగితే 250, 225 టన్నులు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంది ప్రజలను భయాందోళనకు గురి చేసి చంపాలనే పగ చంద్రబాబు, లోకేష్ లది. చంద్రబాబు…
చంద్రబాబు పరిరక్షణ కమిటీతో జూమ్ మీటింగ్ పెట్టారు. కానీ ఎవరికి పరిరక్షణ కమిటోనో అర్థం కాలేదు. అది చంద్రబాబు పరిరక్షణ కమిటీనా అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 35 దేశాల్లో పండుగ చేసుకున్నారు అన్నారు చంద్రబాబు. కరోనా విపత్తులో ప్రపంచం అంతా అల్లాడుతుంటే పండుగ చేసుకోవడం ఏంటి అని అన్నారు. మా ప్రభుత్వం మూడు ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం. ప్రజలు మా ఆలోచనకు మద్దతు ఇచ్చారు. కులం ముద్ర చంద్రబాబే వేయించుకుంటున్నారు. భూములు ఇచ్చిన…
ప్రతి రోజు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి కరోనా పరిస్థితి పై సమీక్ష చేస్తున్నారు అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 104 కి కాల్ సెంటర్ పెట్టి… కరోనాకు సంబంధించిన సమాచారం అందేటట్లు చేస్తున్నాం అని చెప్పిన ఆయన వైద్య అధికారులు నిరంతరం కష్టపడుతున్నారు అని తెలిపారు. రాజకీయాలకు సంబంధం లేకుండా అందరూ కలిసి కట్టుగా వ్యవహరించాల్సిన సమయంలో చంద్రబాబు, లోకేష్, ఆ పార్టీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు. కాగడాలు పట్టుకుని ఏ రకంగా మంట…
ఏపీలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో RTPCR పరీక్షలు మరింత పెంచడానికి 113టెక్నికల్ సిబ్బంది నియామకానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేడు ఆమోదం తెలిపారు. కరోనా పరీక్షలు వేగవంతం చేయడానికి అడుగులు వేస్తుంది ఏపీ ప్రభుత్వం. అయితే కరోనా కట్టడికి తీసుకోవలచిన చర్యలపై ప్రభుత్వం నియమించిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు మరో రెండు ప్రైవేట్…