నెల్లూరును రెండు మూడు సంవత్సరాల్లో మార్చేస్తానని చెప్పాను.. అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నాను అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. ఐదారు వందల కోట్లు గ్రాంట్ రూపంలో తీసుకొని వచ్చాము. 100 కోట్లతో తో పెన్నా నది పై ఇంకో బ్రిడ్జి వస్తుంది ట్రాఫిక్ సమస్య మొత్తం తీరిపోతుంది. నేను ఎటువంటి పనులు చేశానో నెల్లూరు ప్రజలకు తెలుసు. సర్వేపల్లి కాలువ పక్కన 1,250 ఇళ్ళు ఉన్నాయి… అందులో 4,5 ఇళ్ల కే ప్రమాదం ఉంది… అందరికీ అండగా ఉంటాను. గతంలో లాగా ప్రజలకు మేము అన్యాయం చేయం అని తెలిపారు. ఈరోజు ఇక్కడ భూమి విలువ పెరిగింది. నేను నిజంగా చెడు చేసి ఉంటే 2024లో ప్రజలు నాకు బుద్ధి చెబుతారు. ఎవరు ఏమి మాట్లాడిన వాడి పిచ్చివాగుడు కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. వాడి బ్రతుకు ఏంటో మాకు తెలుసు నెల్లూరు ప్రజలకు తెలుసు అన్నారు. ఎవరు ఏం ఫోన్ చేస్తున్నారు, ఎవరు ఎలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అని తెలుసు… మేము అలా చేయము. జగన్ ప్రజా సంక్షేమ పాలనలో ప్రజలకు మంచి చేయాలనే దశ దిశ మాకు ఉంది. నెల్లూరు ప్రాంత రూపురేఖలు అతి త్వరలోనే మారిపోతాయి అని పేర్కొన్నారు.