మంత్రి అప్పలరాజు పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టించడానికి మంత్రికి సిగ్గనిపించడం లేదా… ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని అడిగారు. పలాసలో పోలీసులు వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్నారా , ప్రజలకోసం పనిచేస్తున్నారా. టీడీపీ నుంచి ఇచ్చిన ఫిర్యాదులను పక్కన పడేశారు. వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే టీడీపీ వారి పై కేసులు పెట్టారు. మాకూ సోషల్ మీడియా ఉంది… మేం పోస్టులు పెట్టలేక కాదు..…
సామాజిక సమతౌల్యం సాధ్యం అవుతుందని చేసి చూపిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. తన గత ఐదేళ్ల హయాంలో రాజ్యసభ స్థానాలను అగ్ర కులాలతో నింపిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి పేర్నినాని అన్నారు. కేంద్రంలో రెండు మంత్రి పదవులు వస్తే ఒకటి కమ్మ, ఒకటి క్షత్రియకు ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు సిగ్గు లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ విధానాలను తప్పు పట్టలేక పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో అలజడి సృష్టించి, దాడికి…
పలాస – కాశీబుగ్గ మున్సిపాల్టీకి రెండో వైస్ ఛైర్మన్ గా ఒక దళిత సోదరుడు ఎన్నిక కావడం పలాస చరిత్రలో గొప్ప అధ్యాయం అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మంచి సోషలిస్టు. వెనుకబడిన, దళిత గిరిజన వర్గాలకు చెందిన ఐదుగురిని ఉపముఖ్యమంత్రులుగా చేశారు. అన్ని రాజకీయపదవులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ జనగ్ కే దక్కుతుంది. ఇక చెత్త పై పన్నువేసే విషయంలో పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీ…
ఒక్కొ ఇంటికి 1.80 లక్షల రూపాయలు కేటాయించినట్లు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. నిర్ధేశించిన మొత్తంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. మహిళలకు ఇళ్లు కాదు.. ఆస్తి ఇస్తున్నాం అన్నారు. ఏపీ వ్యాప్తంగా 9 లక్షల ఇళ్ళు గ్రౌండ్ అయ్యాయి. లేఔట్ల వద్దే లబ్ధిదారులకు ఇసుక, స్టీల్, సిమెంట్ సరఫరా చేస్తాం. పేదల ఇళ్ల నిర్మాణానికి చంద్రబాబు పదేపదే అడ్డుపడుతున్నారు. వచ్చే రెండేళ్లలో జగనన్న కాలనీలు పూర్తి చేస్తాం. జగన్ సర్కార్ కు…
గోదావరి జిల్లా వాసులు సంతోషం వస్తే పట్టలేరు. తేడా వచ్చిందో గోదారి యాసలోనే ఏకి పడేస్తారు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి చెందిన మంత్రి ఒకరు రెండో కేటగిరీలోకి చేరారట. ఎమ్మెల్యేగా అందరివాడుగా ఉన్న ఆయన మంత్రి అయ్యాక కొందరివాడుగా మారారని ఒకటే కామెంట్స్. ఎమ్మెల్యే అంటే ఆయనలా ఉండాలన్న వారు.. ఇప్పుడు మాకొద్దు బాబోయ్ అని దూరం జరుగుతున్నారట. ఎందుకలా? ఆయనలో వచ్చిన మార్పులేంటి? ఎవరా మంత్రి? లెట్స్ వాచ్! ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుడ్‌మార్నింగ్ అని పర్యటించేవారు!…
పార్టీలో ఎవరు చేరాలనుకున్నా అన్ కండీషనల్ గా రావాల్సిందే అని మంత్రి కొడాలి నాని అన్నారు. కనకదుర్గమ్మ, శ్రీశైలం గుళ్ళల్లో క్షుద్రపూజలు చేసిన వ్యక్తి చంద్రబాబు. వైఎస్ రాజశేఖరరెడ్డి అనే మహా వృక్షంలో చిన్న చిగురు జగన్. ఆ చిగురు ఇవాళ మహా వృక్షమయ్యింది. జగన్మోహన్ రెడ్డి పై చంద్రబాబు, ఆయన తాబేదారులు, కొన్ని మీడియా సంస్థలు విషం కక్కుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం. కొంత మంది రాజశేఖర్ రెడ్డిని…
ఏపీలో గత కొన్ని రోజులుగా చర్చాంశనీయంగా మారిన బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిని నిర్ణయించే అంశంపై మంత్రి వెలంపల్లి చర్యలు తీసుకుంటున్నారు. పీఠాధిపతి నియమాకాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని ధార్మిక పరిషత్తుకు మంత్రి వెలంపల్లి సూచించారు. పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ నిర్వహించేందుకు ప్రత్యేకాధికారిగా దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ను నియమించారు ధార్మిక పరిషత్. పీఠాధిపతి నియామకంపై వివిధ పీఠాధిపతులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామక ప్రక్రియను వీలైనంత త్వరగా…
గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపేటలో వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే జిందాల్ ప్లాంట్ ను పరిశీలించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన మంత్రి బొత్స జిందాల్ ప్లాంట్ ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదజేశాలు ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… 2016లోప్లాంటు పనులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వంలో కేవలం 10 శాతం మాత్రమే పనులు పూర్తిచేసింది. మేం అధికారంలోకి వచ్చాక ప్లాంట్ ప్రారంభ దశకు వచ్చింది. గుంటూరు, విజయవాడ…