గుంటూరులో బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య బాధకలిగించింది అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. అయితే గుంటూరు ఘటన పై సీఎం జగన్ తక్షణమే స్పందించారు అని తెలిపారు. ఇక గుంటూరులో లోకేష్ పర్యటించడాన్ని మేం తప్పు పట్టడం లేదు. కానీ లోకేష్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. చెత్తనాకొడుకులు , వెధవలు అని మాట్లాడుతున్నాడు. మాకు బూతులు రావా …మేం మాట్లాడలేమనుకుంటున్నారా అని అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ దిగజారి వ్యవహరించడం సరికాదు. సానుభూతి పేరుతో రాజకీయ…
గుంటూరు దళిత యువతి హత్య ఘటన విషయంలో చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి కొడాలి నాని విరుచుకపడ్డాడు. జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని పక్కదారి పట్టించేందుకే లోకేష్ డ్రామా చేస్తున్నాడని అన్నారు. ఎక్కడో ఫేస్ బుక్ లో పరిచయం అయిన వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 14 ఏళ్ళు సీఎమ్ గా పని చేసిన చంద్రబాబు లోకేష్ తో లుచ్చా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టించాడు. చంద్రబాబులాంటి వెధవ దళిత యువతిని హత్యచేశాడు. దాన్ని తీసుకుని వచ్చి ముఖ్యమంత్రికి అంటగడతున్నారు…
శ్రీకాకుళం బందరువానిపేటలో పర్యటించారు మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. ఈ సందర్భంగా బోటు బోల్తా ఘటనలో మృతిచెందిన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు అప్పలరాజు, ధర్మాన. మృతి చెందిన ముగ్గురు మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. తక్షణ సహాయం కింద ఐదులక్షల చొప్పున చెక్కులు అందించారు. మత్స్యకారులకు జగన్ ఎప్పుడూ అండగా ఉంటారు. మత్స్యకారుల అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం అని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఫ్లోటింగ్ జెట్టీల నిర్మాణాలకు ప్రతిపాదనలు…
డీఆర్ సీసీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ ఏడాది నీటికేటాయింపులపై త్వరలో సమావేశం ఏర్పాటు అవుతుంది అని జిల్లా ఇంఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. భీమా విషయంలో రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జిల్లాలో 429 లేఅవుట్ లలో ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం. 229 లేవుట్ లలో పనులు ప్రారంభించాం. ఇసుక అందరికి అందుబాటులోకి తెస్తున్నాం.172 ప్రాంతాల లో ఇసుక రీచ్ లను గుర్తించాం. ట్రాక్టర్, బండ్లతో ఉచితంగా ఇసుక…
ఈ నెల 16వ తేదీ నుంచి ఏపీలో స్కూళ్లను రీ-ఓపెన్ చేస్తున్నాం అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రెగ్యులర్ టైమింగ్సులోనే స్కూళ్లను రన్ చేస్తాం అని అన్నారు. ఇక కోవిడ్ ప్రొటోకాల్ పాటించేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తైంది. వ్యాక్సిన్ వేయించుకోని మిగిలిన టీచర్లకు కూడా టీకాలు వేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించాం. ఆన్ లైన్ తరగతులు రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదు అని పేర్కొన్నారు.…
ప్రజల హృదయాల నుంచి ఉద్యమాలు పుడతాయి. కొంతమంది ప్రయోజనాల కోసం చేసే వాటిని డ్రామాలంటారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా చంద్రబాబు లాంటి సీనియర్ నేతలు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోంది అని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. 600 రోజులు అయ్యాయని ఒక పండుగ వాతావరణం టీడీపీలో కలిగిస్తోంది. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకోవాలి. లోకేష్ మంగళగిరిలో ఓడిన తర్వాత అయినా వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని…
కొత్త విద్యా విధానాన్ని ఏపీ కెబినెట్ ఆమోదించింది అని మంత్రి పేర్ని నాని తెలిపారు. కొత్త విద్యా విధానం వల్ల స్కూళ్ల మూసివేత ఉండదు.. ఏ ఉపాధ్యాయుడి ఉద్యోగం తీసే ప్రసక్తే ఉండదు. పీపీ-1, పీపీ-2 మొదలుకుని హైస్కూల్ ప్లస్ వరకు పాఠాశాలలు ఉంటాయి. హైస్కూల్ ప్లస్ కేటగిరిలో మూడో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా బోధన ఉంటుంది. విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలను కెబినెట్లో తీసుకున్నాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు…
పప్పు చెప్పిన మాటలకు ఏం స్పందిస్తాం… ఎవరి పాదం మంచిదో రాష్ట్రంలో అందరికీ తెలుసు అని ఏపీ ఇరిగేషన్ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. తాజాగా ఎన్టీవీతో మాట్లాడిన ఆయన… జగన్ పాదం వల్ల రాష్ట్రంలో డ్యాములు, రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. అన్నమయ్య గేటు ఎత్తుకుని పోయిన విషయం ట్వీట్ చేసిన వ్యక్తి కి తెలియదా… చంద్రబాబు పాదం పడగానే గోదావరి లో 35 మంది చనిపోయారు. పులిచింతల గేటు కొట్టుకుపోవటం వల్ల నష్టం ఏమీ లేదు.…
కోల్‌మైనింగ్‌లో ఎపిఎండిసి- ఆంధ్ర ప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మరో కీలక మందడుగు వేసింది అని భూగర్భ, ఖనిజ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మధ్యప్రదేశ్ సింగ్రౌలి జిల్లాలోని సుల్యారీ బొగ్గుగనిలో మైనింగ్ భూమిపూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ… ఈ వారం నుంచే తవ్వకాలు ప్రారంభం అవుతాయి. నెల రోజుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. 1298 హెక్టార్ల భూమిలో, 2000 కోట్ల రూపాయల పెట్టుబడితో మైనింగ్ చేపడుతున్న ఏపీఎండీసీ… ఏటా 5 మిలియన్ టన్నుల…