వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన రాబోయే తరాలకు ఓ దిక్సూచి అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పార్టీలకు, రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా జగన్ మోహన్ రెడ్డి పాలన సాగుతోంది అని తెలిపిన ఆయన రెండేళ్లలో లక్షా 31వేల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమచేశాం అని పేర్కొన్నారు. రూపాయి లంచం లేకుండా జగన్ ఒక్క బటన్ నొక్కితే లబ్ధిదారులకు సంక్షేమం అందుతోంది. కోట్లాది మంది కష్టాలను స్వయంగా చూసిన వ్యక్తి సీఎం జగన్. మొన్నటి ఎన్నికల ఫలితాలే జగన్ పరిపాలనకు గీటురాయి అని చెప్పిన మంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండటం ఖాయం అని ధీమా వ్యక్తం చేసాడు.