రెండేల్ల పాలనలో సీఎం వైఎస్ జగన్ 94 శాతం హామీలు నెరవేర్చారు. అన్ని రంగాల్లో మహిళలకు సీఎం జగన్ ప్రాధాన్యత కల్పించారు అని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మంత్రి వర్గంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం కల్పించిన ఘనత సీఎం జగన్ దే. నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు సీఎం కల్పించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఆడపిల్లల డ్రాపవుట్లు తగ్గించిన ఘనత సీఎందే అని తెలిపారు. విద్యార్థినులు చక్కగా చదువుకునేందుకు కిట్లును విద్యా కానుక ద్వారా ఇస్తున్నారు. విద్యా దీవెన,వసతి దీవెన కల్పిస్తున్నారు. రైతు రాష్ట్రానికి వెన్నుముక లాంటివారు. రైతు భరోసా అమలు సహా ఆర్బీకే లద్వారా విత్తనాలు,ఎరువులు అందిస్తున్నారు. రైతులు పండించిన పంటలకు ఆర్బీకే ద్వారా గిట్టుబాటుధరలు కల్పించేలా సీఎం చర్యలు తీసుకున్నారు
కోవిడ్ కేర్ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది. ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒక మెడికల్ కళాశాల చొప్పున 16 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా 56 వేల 875 కోట్లు నేరుగా మహిళల ఖాతాల్లోసీఎం జగన్ జమ చేశారు. జగన్ రెండేళ్ల పాలనలో విధ్వంసం జరిగిందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ రెండేళ్ల పాలనలో సంక్షేమం విస్పోటనం చెందిందని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలను ఎన్నికల సమయంలో ఒటు బ్యాంకుగానే తెదేపా చూసింది. ప్రజలకు సంక్షేమం అందించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ రెండేళ్ల పాలన జరిగింది . సీఎం జగన్ తమకు తోబుట్టువుగా నిలబడి అండగా నిలిచారని మహిళలు భావిస్తున్నారు అని హోం మంత్రి పేర్కొన్నారు.