అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి వైద్యం తప్పదు అని మంత్రి బుగ్గన అన్నారు. ఆయుర్వేదిక్, హోమియోపతి వేల సంవత్సరాల నుంచి వున్నా అత్యవసరంలో అల్లోపతి బెటర్ అని తెలిపారు. కోవిడ్ విషయంలో ప్రపంచం అనుసరిస్తున్న ప్రోటోకాల్ ఫాలో కావాల్సి వస్తుంది. కరోనాను ఏపీ ప్రభుత్వం అద్భుతంగా హాండిల్ చేస్తుంది. ప్రభుత్వం, అధికారులు కరోనాకట్టడికి నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రతిరోజు ప్రభుత్వం కరోనా పై సమీక్ష చేస్తుంది. కోవిడ్ నివారణకు ప్రజల సహకారం ముఖ్యం అని తెలిపిన మంత్రి బుగ్గన లక్షణాలు కనిపించినా ఆలస్యంగా వైద్యులను సంప్రదిస్తున్న వారు , మూర్ఖంగా వ్యవహరిస్తున్న వారే అధికంగా చనిపోతున్నారు అని పేర్కొన్నారు.