కరోనా పరీక్షలు పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో RTPCR పరీక్షలు మరింత పెంచడానికి 113టెక్నికల్ సిబ్బంది నియామకానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేడు ఆమోదం తెలిపారు. కరోనా పరీక్షలు వేగవంతం చేయడానికి అడుగులు వేస్తుంది ఏపీ ప్రభుత్వం. అయితే కరోనా కట్టడికి తీసుకోవలచిన చర్యలపై ప్రభుత్వం నియమించిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 12ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు మరో రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న VRDL కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహణకు సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. రాష్ట్రములో ఉన్న VRDL కేంద్రాల్లో RTPCR పరీక్షలు రిపోర్ట్ అతి తక్కువ సమయంలో రావడానికి చర్యలు తీసుకుంటున్నాం. 6నెలలు పాటు కాంట్రాక్టు బేస్ లో కొత్తగా తీసుకుంటున్న సిబ్బంది నియామకం అమలులో ఉంటుంది. 24గంటలు గడవక ముందే గ్రూప్ అఫ్ మినిస్టర్స్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలులోకి తెచ్చారు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.
Also Read
ప్రతి రోజు14VRDL కేంద్రాల్లో కోవిడ్ పరీక్షలు మరింత పెంచడానికి అదనపు సిబ్బంది నియామకం తక్షణమే అమలులోకి వస్తుందన్న మంత్రి ఆళ్ల నాని గత ఏడాది మార్చిలో వచ్చిన మొదటి విడత కోవిడ్ లో 92మందిని నియమించాం. మూడు దశల్లో ఇప్పటివరకు అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కరోనా పరీక్షలు నిర్వహణకు 533మంది సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసాం అని తెలిపారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరో 110మందిని తక్షణమే టెక్నికల్ మెడికల్ సిబ్బందిని నియమిస్తున్నాం. ప్రతి VRDL కేంద్రంలో కరోనా పరీక్షలు చేయడానికి ఒక రిచర్సి సైo టిస్థు, రిచర్చి అసిస్టెంట్, ల్యాబ్ టెక్నిషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సభార్డినేట్ పోస్ట్లు భర్తీ చేస్తున్నామన్న మంత్రి ఆళ్ల నాని…
6 నెలలు పాటు కొత్తగా నియమిస్తున్న సిబ్బంది విధులు నిర్వహిస్తారు అని అన్నారు.
ప్రస్తుతం RTPCR పరీక్షలు ప్రతి రోజు 40వేలకు పైబడి చేస్తున్నాం.కొత్తగా సిబ్బంది నియామకం వల్ల RTPCR పరీక్షలు రోజుకి 60వేలకు పైబడి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి ఆళ్ల నాని… ట్రూనాట్ పరీక్షలు గతంలో రోజుకి 10వేలు పరీక్షలు చేసేవాళ్ళం. ట్రూనాట్ పరీక్షలు కూడ మరింత పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మరో మూడు రోజుల్లో ట్రూనాట్ పరీక్షలు కూడ నిర్వహించడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని పేర్కొన్నారు. ఇక రాష్ట్రములో ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు ఏలూరు ఆశ్రమం మెడికల్ కాలేజీ, విజయనగరం మహారాజ మెడికల్ కాలేజీల్లో కూడ RTPCR పరీక్షలు నిర్వహిస్తాం అని అన్నారు.
- Tags
- Alla Nani
- ap minister
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!