కర్నూలు జిల్లాలో పోటాపోటీగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. మంత్రి సీదర అప్పలరాజుపై వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు నమోదయ్యింది. N 440 K వైరస్ కర్నూలు లో ఉన్నట్టు నిర్ధారణ అయిందని, ప్రమాదకరమైందని మంత్రి డిబేట్ లో చెప్పారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ ఫిర్యాదు చేసారు. ఇప్పటికే వన్ టౌన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు పై కేసు నమోదు అయ్యింది. కర్నూలులో ఎన్-440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసారు. చంద్రబాబు వ్యాఖ్యలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీసీ 155, 505(1)(బి)(2) సెక్షన్ల కింద చంద్రబాబుపై కేసు నమోదు అయ్యింది. చంద్రబాబుపై 2005 ప్రకృతి వైఫరిత్యాల చట్టం కింద నోటీసులు ఇస్తామని ప్రకటించారు కర్నూలు ఎస్పీ పక్కిఱప్ప. మంత్రి సీదర అప్పుల రాజు కూడా అదే వ్యాఖ్యలు చేయడంతో ఫిర్యాదులు చేస్తుంది టీడీపీ. చంద్రబాబు పై కేసు నమోదు చేసిన పోలీసులు మంత్రి అప్పలరాజు పై కూడా కేసు నమోదు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది.