చంద్రబాబు పరిరక్షణ కమిటీతో జూమ్ మీటింగ్ పెట్టారు. కానీ ఎవరికి పరిరక్షణ కమిటోనో అర్థం కాలేదు. అది చంద్రబాబు పరిరక్షణ కమిటీనా అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 35 దేశాల్లో పండుగ చేసుకున్నారు అన్నారు చంద్రబాబు. కరోనా విపత్తులో ప్రపంచం అంతా అల్లాడుతుంటే పండుగ చేసుకోవడం ఏంటి అని అన్నారు. మా ప్రభుత్వం మూడు ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం. ప్రజలు మా ఆలోచనకు మద్దతు ఇచ్చారు. కులం ముద్ర చంద్రబాబే వేయించుకుంటున్నారు. భూములు ఇచ్చిన రైతులకు చట్టప్రకారం ఇవ్వాల్సిన అన్ని రకాల చెల్లింపులు చేస్తున్నాం. చంద్రబాబు కోర్టులకు వెళ్లి అభివృద్ధికి అడ్డంపడుతుండటం వల్లే ఆలస్యం అవుతోంది. వైద్య సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి కోవిడ్ చికిత్స అందిస్తున్నారు. వాళ్ళందరికి అభినందనలు. యంత్రాంగం లేకపోతే పనులు ఎలా అవుతాయి. అదే సమయంలో ఉద్యోగుల ఒత్తిడికి లోనుకాకుండా చూస్తున్నాం అని తెలిపారు.