AP Liquor Scam Case: నేను ఆ విషయం సిట్‌కు చెప్పలేదు.. ల్యాప్‌టాప్ అంటే తెలియదు.. వాట్సాప్ వాడటం కూడా రాదు..!
- సిట్ వారు సహకరించారు.. వారు ఆడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పా..
- కేసుతో నాకేం సంబంధం లేదు..
- అంతా పైవాళ్లే చేశారని నేను ఎక్కడ సిట్ అధికారులకు చెప్పలేదు..
- నాకు ల్యాప్‌టాప్ అంటే ఏంటో.. దానిని ఎలా వాడాలో తెలియదు..
- నాకు వాట్సాప్ వాడటం కూడా రాదన్న నారాయణస్వామి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో శుక్రవారం రోజు వైసీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ప్రశ్నించారు సిట్ అధికారులు.. దాదాపు 6 గంటల పాటు నారాయణస్వామిని విచారించిన సిట్ అధికారులు కీలక విషయాలు రాబట్టారని.. ఆయన కీలక సమాచారం ఇచ్చారని, ల్యాప్‌టాప్ కూడా సీజ్ చేశారని వార్తలు వచ్చాయి.. అయితే, సిట్ విచారణపై మరోసారి మీడియాతో మాట్లాడిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఆసక్తికర విషయాలు వెల్లడించారు.. సిట్ వారు సహకరించారు.. వారు ఆడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను… కేసుతో నాకేం సంబంధం లేదు.. అంతా పైవాళ్లే చేశారని నేను ఎక్కడ సిట్ అధికారులకు చెప్పలేదని స్పష్టం చేశారు.. సిట్ అధికారులు ఇబ్బంది పడే ప్రశ్నలు అడిగాన.. నేను సమాధానం చెప్పాను… నన్ను అరెస్టు చేశారంటూ కోందరూ అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు.
Read Also: Parliament: ప్రధాని మోడీ, వీవీఐపీల భద్రతకు ముప్పుగా మారిన చెట్టు.. అసలేంటి ఈ కథ..?
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
నేనెప్పుడూ నీతిగా, నిజాయితీ బతికాను… ఎప్పుడూ తప్పు చేయలేదు.. అవినీతి చేయలేదన్నారు నారాయణస్వామి.. ఇక, నాకు ల్యాప్‌టాప్ అంటే ఏంటో.. దానిని ఎలా వాడాలో కూడా తెలియదు.. నాకు వాట్సాప్ వాడటం కూడా రాదన్నారు.. ల్యాప్ టాప్ సిట్ అధికారులు తీసుకుని పోలేదన్నారు.. ప్రభుత్వం తరపున మద్యం అమ్మకాలు చేస్తే అవినీతికి అవకాశం ఉండదు అని తెలిపారు.. ప్రైవేటు గా అమ్మకాలు సాగిస్తేనే అవినీతి జరుగుతుందన్నారు.. కూటమీ ప్రభుత్వంలో రాష్ట్రంలో పాల ప్యాకెట్ల కంటే మద్యం 24 గంటలకు దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.. నేను ఎక్కడ తప్పుడు సంతకాలు పెట్టలేదు… నేను ఏంటో చంద్రబాబుకు తెలుసు…. నేను మంచోడినని ఆయనే చెప్పారని గుర్తుచేసుకున్నారు.. మరోవైపు, జగన్ ఎప్పుడూ పిలిచి చెప్పిన పనులు చేయాలని నాకు చెప్పలేదు… ఎప్పుడూ పిలిస్తే అప్పుడు విచారణకు వెళ్తాను అన్నారు.. ఎనిమిది కోట్లు దొరికిందని అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి..
తాజావార్తలు
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!