AP JAC Amaravati: ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణలో భాగంగా నేటి నుండి 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలకు ఏపీ జేఏసీ అమరావతి నేతల వినతులు సమర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.. మీరైనా మా సమస్యలు ప్రభుత్వ పెద్దలకు తెలపండి అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు.. ఉద్యోగుల ఆవేదనని మీరైనా పట్టించుకొండి.. ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమన్నారు…
AP JAC Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు ముగిసిన తర్వాత.. చల్లబడినట్టే కనిపించిన ఉద్యోగ సంఘాలు మళ్లీ ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి.. ఏపీ జేఏసీ అమరావతి అత్యవసర కార్యవర్గ సమావేశం ముగిసింది.. ఉద్యమ కార్యాచరణ కొనసాగింపుపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు.. మొత్తంగా ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది ఏపీ జేఏసీ అమరావతి. ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.. మినిట్స్ కాపీలు ఇచ్చిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగించాలని అభిప్రాయపడింది అత్యవసర కార్యవర్గం. ఆ తర్వాత ఉద్యమ…
ఉద్యమంలోకి ఏ రాజకీయ పార్టీనీ అనుమతించమని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలను.. ట్రేడ్ యూనియన్ నేతలను మాత్రం ఉద్యమంలోకి అనుమతిస్తామని, సీపీఎస్ రద్దు అంశంపై గట్టిగా ఉద్యమిస్తామన్నారు. ఫిబ్రవరి 7 నుంచి నిరవధి సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న నోటీసు ఇస్తామని, 23వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపడుతామన్నారు.…
ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని.. తమ సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని కోరుతూ మళ్లీ సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ లోని సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతల భేటీ అయ్యారు. పీఆర్సీ సాధనా సమితి పేరుతో ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఎన్జీవో హోంలో సమావేశానికి కొనసాగింపుగా అప్సా కార్యాలయంలో నేతల సమావేశం నిర్వహించారు. సంప్రదింపుల కోసం ప్రభుత్వం ఏర్పాటు…
ఏపీలో పీఆర్సీపై రగడ జరుగుతోంది. ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగ సంఘాలు 11వ పీఆర్సీ కోసం క్షీరసాగర మదనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ సమీర్ శర్మపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ చేసిన కామెంట్లను ఐఏఎస్ అధికారుల సంఘం తప్పు పట్టింది. దీంతో ఏపీ ఐఏఎస్ అధికారుల అసోసియేషనుకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కౌంటర్ ఇచ్చింది. సీఎస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిలుకు ఛైర్మన్ హోదాలో సీఎస్ ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించాలని ఉద్యోగ సంఘాల…
11వ పీఆర్సీపై ఏపీలో మళ్లీ నిరసన జ్వాలలు రగులుతున్నాయి. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కాయి. దీంతో ఉద్యోగులతో పలుమార్లు చర్చలు జరిపి, కమిటీలు వేసి చివరికి ఇటీవల సీఎం జగన్ పీఆర్సీపై ప్రకటన చేశారు. అయితే ప్రకటనకు ముందు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపిన ప్రభుత్వం.. కోవిడ్ కారణంగా ఫిట్మెంట్, హెచ్ ఆర్ ఏ లాంటి వాటిని తగ్గించాలని ఉద్యోగ సంఘాలకు సూచించింది. చర్చల తరువాత ఉద్యోగ సంఘాల నేతలు…
11వ పీఆర్సీపై ఏపీలో మళ్లీ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన పీఆర్సీపై విముఖత ఉన్న ఉద్యోగ సంఘాలు.. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడుతామని ప్రకటించాయి. మరోమారు ప్రభుత్వంతో చర్చలు జరిపి తమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. సీఎంఓ అధికారులతో చర్చలకు ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ…
ఏపీలో పీఆర్సీపై రగడ నడుస్తోంది. కొన్ని నెలలు 11వ పీఆర్సీపై కసరత్తు చేసిన జగన్ సర్కార్ ఎట్టకేలకు పీఆర్సీ ప్రకటించింది. సీఎం జగన్ తో జరిగిన భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు ప్రధాన అంశాలను పరిష్కరించారని వెల్లడించారు. ఆ తరువాత ప్రభుత్వం ప్రకటించిన జీవో ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని, తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగుల వేతనం విషయంలో…