సీఎంఓ అధికారులతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు.. ఫలించేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
11వ పీఆర్సీపై ఏపీలో మళ్లీ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన పీఆర్సీపై విముఖత ఉన్న ఉద్యోగ సంఘాలు.. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడుతామని ప్రకటించాయి. మరోమారు ప్రభుత్వంతో చర్చలు జరిపి తమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. సీఎంఓ అధికారులతో చర్చలకు ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ లు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ రెండు సంఘాలు కలిసి పోరాడటానికి నిర్ణయించిన నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయానికి రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో సీఎంఓ అధికారులతో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని మరోసారి సీఎంవో అధికారులను ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. అయితే గతంలో కూడా ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు జరుపుతున్న చర్చలు ఫలిస్తాయా..? అని కొందరు ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?