AP High Court: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికార దుర్వినియోగం చేశారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. దీనిపై విచారణ జరిపింది హైకోర్టు.. ఈ సందర్భంగా.. హైకోర్టులో కీలక వాదనలు వినిపించారు పిటిషనర్ తరఫు న్యాయవాదులు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సినీ ప్రాజెక్ట్ హరిహర వీర మల్లు ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ దాఖలు చేశారు. అయితే, ప్రభుత్వ పదవిలో ఉన్న మంత్రి తన పదవి, అధికారాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫు లాయర్లు వాదించారు.. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఇలాగే తమ స్వప్రయోజనాల కోసం వ్యవహరిస్తే ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందన్నారు.. రేపు ఇతర మంత్రులు కూడా ఇదే విధంగా తమ సొంత వ్యాపారాలు, కంపెనీలకు డైరెక్టర్లుగా వ్యవహరిస్తే ప్రభుత్వ పరిపాలన పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చరించారు. ఇది కొనసాగితే ప్రభుత్వ యంత్రాంగం ప్రజల సేవ కోసం కాకుండా వ్యక్తిగత లాభాల కోసం మాత్రమే పనిచేసే ప్రమాదం ఉందని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఇక, వాదనలు విన్న ఏపీ హైకోర్టు.. తదుపరి విచారణ ఈనెల 15వ తేదీకి వాయిదా వేసింది..
Read Also: Shocking Incident: ఏమైంది ఆ తల్లికి .. 15 రోజుల బిడ్డ విషయంలో ఎందుకలా చేసింది!