AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్‌లో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది.. అయితే, దీనిపై పెద్ద దుమారమే రేగింది.. పీపీపీ మోడ్ అంటూనే మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయడంటూ అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించింది.. ఇక, ఈ వ్యవహారం ఏపీ హైకోర్టు వరకు చేరింది.. పీపీపీ మోడల్‌లో మెడికల్ కాలేజీల అభివృద్ధిని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది.. ఆ పిల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. పీపీపీ మోడల్‌లో వైద్య కళాశాలల అభివృద్ధికి అనుమతిస్తున్న జారీ చేసిన జీవో నంబర్ 590ని రద్దు చేయాలని పిటిషనర్ వాదించారు.. అయితే, దీనిపై కూటమి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. ఇక, తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.. మరోవైపు బిడ్డింగ్ ప్రక్రియపై ఇప్పుడు స్టే ఇవ్వలేమని వ్యాఖ్యానించింది ధర్మాసనం.. అయితే, ఈ పిల్‌ను గుంటూరు జిల్లా తాడేపల్లి చెందిన డాక్టర్ జు వసుంధర దాఖలు చేశారు.. 590 జీవో రద్దు చేయటంతో పాటు వైద్య కళాశాలల నిర్వహణ, నిర్మాణం, పాలన గత జీవోలకు అనుగుణంగా ప్రభుత్వం నడిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు పిటిషనర్..
Read Also: AI Crime: AIతో ఐటీ స్టూడెంట్ దారుణం.. 36 మహిళా విద్యార్థుల అశ్లీల చిత్రాలు..