AP High Court: అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది.. అయితే, కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ కార్యదర్శి, శాసన వ్యవహారాల కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది..
Read Also: CI Legal Notice To Chandrababu: సీఎం చంద్రబాబుకు సీఐ లీగల్ నోటీసులు..
కాగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ జగన్.. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన స్పీకర్ రూలింగ్ చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలని పిటిషన్ లో హైకోర్టును కోరారు.. ఈ రూలింగ్ రద్దు చేయాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.. ఈ రూలింగ్ ఏపీ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్ క్వాలిఫికేషన్ చట్టంలో సెక్షన్ 12బీ కి విరుద్ధమని ప్రకటించాలని హైకోర్టును కోరారు జగన్.. అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శికి తనను ప్రతిపక్ష నేతగా హోదా కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.. అయితే, జగన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది..