Andhra Pradesh: పాఠశాలల్లో పిల్లలకు మాతృ భాషపై నేర్పటంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. విద్యార్థులకు బేసిక్ లైన్ పరీక్షలు జరపటంలేదని, జరిపినా ఫలితాలు వెల్లడించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. దీనివల్ల మాతృ భాష రాక ఐదో క్లాస్ విద్యార్ది రెండో క్లాస్ కూడా చదవలేక పోతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. అయితే, మాతృభాష తెలియకపోతే వేరే భాషలపై పట్టు ఎలా వస్తుందని ప్రశ్నించింది న్యాయస్థానం.. గతంలో మాతృ భాష రాకపోతే సిగ్గుపడే వారు.. ఇప్పుడు మాతృ బాష రాకపోతే గొప్పగా చెబుతున్నారంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది.. విద్యార్థులు అంటే దేశానికి భావి భవిష్యత్ అని పేర్కొన్న కోర్టు.. మాతృభాష రాకపోతే ఏం చేయగలరని ప్రశ్నించింది.. సమాజంలో మేధావులు ఇంకా ఉన్నారని వారి సేవలు వినియోగించు కోవాలని న్యాయ స్థానం సూచించింది.. ఇక, విద్యార్థుల్లో మాతృ భాష అధ్యయన సామర్థ్యం పెంచేందుకు ఏం చర్యలు చేపట్టారో తెలపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
Read Also: Big Breaking: హిరణ్యకశిపను ప్రకటించిన రానా.. గుణశేఖర్ ప్లేస్ లో గురూజీ..?