Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవపల్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అయిన విషయం విదితమే.. అయితే, చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. స్కిల్ కేసులో చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది సీఐడీ.. ఆ పిటిషన్‌పై నేడు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరపనుంది.. చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్ లో సీఐడీ పేర్కొంది..
Read Also: IND vs AUS: 9 నెలల వ్యవధిలో మూడు ఐసీసీ ఫైనల్స్ ఓటములు.. ఆస్ట్రేలియా గండాన్ని దాటలేమా?
Also Read
అయితే, జనవరి 19వ తేదీన విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సుప్రీంకోర్టును కోరారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.. ఇరు పక్షాలూ తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. విచారణను ఫిబ్రవరి 12వ తేదీ.. అంటే ఇవాళ్టికి వాయిదా వేసింది.. దీంతో. ఇవాళ్టి విచారణ ఎలా ఉండబోతోంది అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిన విషయం విదితమే కాగా.. 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో గడిపారు చంద్రబాబు.. ఇక, మొదట మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది.. దీంతో.. ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ సీఐడీ.
తాజావార్తలు
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!