సామాన్యులకు ఇసుక ధర భారీగా పెరగడం కారణంగా అందుబాటులో ఉండట్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో ఇసుక ధర బంగారంతో పోటీ పడుతోందని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించి మైనింగ్ అనుమతులు తీసుకున్న సంస్థలు అధిక ధరలు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది హైకోర్టు. కేవలం 5 ఎకరాల్లో అనుమతులు తీసుకొన్నవారు., ఏకంగా 50 ఎకరాల్లో అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారని తెలిపింది. Also read: Murder:…
APPSC Group 1 Main Exam 2018 Canceled: తాజాగా ఏపీ హైకోర్టు 2018 లో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ ను రద్దు చేసింది. ఈ పరీక్షలకి సంబంధించి ప్రశ్నపత్రాల డిజిటల్ వాల్యుయేషన్ పై కొందరు అభ్యర్థులు పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జులై 22, 2022లో 2018 గ్రూప్-1 పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. అయితే ఇందులో అనుమానాలున్నాయని కొందరు అభ్యర్థులు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన టెట్, టీఆర్టీ(టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) నోటిఫికేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల షెడ్యూల్ మార్చాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ రెండు పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని పేర్కొంది.
హైదరాబాద్ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. హైదరాబాద్ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొంటూ చట్టం తెచ్చేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం.. తెలంగాణ, ఏపీల మధ్య ఆస్తులు, అప్పులు, తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తికాలేదని పేర్కొంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజాసంక్షేమ సేవాసంఘం కార్యదర్శి…
డీఎస్సీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎస్జీటీ పోస్టుల పరీక్షకు బీఈడీ అభ్యర్థులను అనుమతించమని న్యాయస్థానం ముందు ప్రభుత్వం తరపున లాయర్ తమ వాదనను వినిపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఆకుల వెంకట శేషశాయి, జస్టిస్ సుమతి ధర్మాసనం ముందు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడo సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకం అని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తెలిపారు.
‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైసీపీ అభ్యంతరాలను తోసిపుచ్చిన హైకోర్టు.. స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. రివైజింగ్ కమిటీ అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాకే ధ్రువపత్రం జారీ చేసిందని హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో నేటి నుంచి యధావిధిగా రాజధాని ఫైల్స్ షోలు కొనసాగనున్నాయి. రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారులు గురువారం అడ్డుకున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు రాజధాని ఫైల్స్ సినిమా…
జనసేనకు గ్లాస్ గుర్తు రద్దు చేయాలన్న పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.