వాలంటీర్ల రాజీనామాతో మాకు సంబంధం లేదని హైకోర్టుకు తెలిపింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం.. ఇప్పటి వరకు 66 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్టు కోర్టుకు తెలిపిన ఈసీ.. 900 మందికి పైగా వాలంటీర్ల మీద చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది.. ప్రభుత్వంలో ఉంటే వాలంటీర్ల మీద చర్యలు తీసుకుంటామని రాజీనామా చేసిన వారి విషయంలో మేమే సర్క్యులర్ ఎలా ఇవ్వగలమని కోర్టుకు చెప్పింది.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో విలేజ్/వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవహారం కాకరేపుతోంది.. అయితే, మూకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామా చేయడం చర్చగా మారింది.. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఏపీలో వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టులో బోడే రామచంద్ర యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు.. బీసీవై పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బోడే రామచంద్ర యాదవ్.. వాలంటీర్ల రాజీనామాలు ఆమోదిస్తే వీరంతా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తారని, ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు పక్కదారి పడతాయని తన పిటిషన్ ద్వారా…
లోక్ సభ ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆసరా పెన్షన్ల పంపిణీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ వాలంటీర్లను తప్పించడంతో పెన్షన్దారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడికిహైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అచ్చెన్నాయుడిపై ముందస్తు చర్యలు వద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.