ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఆకుల వెంకట శేషశాయి, జస్టిస్ సుమతి ధర్మాసనం ముందు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడo సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకం అని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. దీనిపై బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన పది లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్న పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: Ranchi Test: కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తే.. అతడిపై వేటు తప్పదు! యశస్వి డౌటే
ఇక, దేశ అత్యున్నత న్యాయస్థానం, ఎన్సీటీఈ నిబంధనలుకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందన్న పిటిషనర్ తెలిపారు. తప్పులతడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందన్న పిటిషనర్ ఆరోపించారు. ఇక, సుప్రీం కోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నా బీఎడ్ అభ్యర్థులను ఎలా అనుమతిచారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీం కోర్టు తీర్పు మీకు వర్తించదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక్కసారి సుప్రీం కోర్టు ఆదేశాలు ఇస్తే అవి దేశ వ్యాప్తంగా అమలు కావలసిందే కదా అని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే, ప్రధాన న్యాయమూర్తి సెలవు కారణంగా రేపు ఈ పిటిషన్ ను విచరిస్తామని ధర్మాసనం వెల్లడించింది.