Rajadhani Files: ‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలను ఆపండి..! హైకోర్టులో పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajadhani Files: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ తిరుగుతోన్న సినిమాలపై రాజకీయ నేతలు కోర్టులకు ఎక్కుతున్నారు.. ఇప్పటికే వివాదాస్పద దర్శకుడిగా పేరుతెచ్చున్న రాంగోపాల్‌వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాపై హైకోర్టుకు వెళ్లారు టీడీపీ నేతలు.. ఇప్పుడు.. ‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలను ఆపాలంటూ హైకోర్టు మెట్లు ఎక్కింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అయితే, ఆ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వుల జారీ వ్యవహారంపై నిర్ణయాన్ని ధర్మాసనం వాయిదా వేసింది.
Read Also: Sonia Gandhi: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ.. నేడే నామినేషన్ దాఖలు
Also Read
సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.. సినిమా విడుదల నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు పిటిషనర్.. విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. తీర్పు రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.. అయితే, రాజధాని ఫైల్స్ సినిమా విడుదల నిలిపి వేయాలని పిటిషన్ వేశారు వైసీపీ ఎమ్మెల్సీ లెళ్ల అప్పిరెడ్డి.. ఈ సినిమాలో సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి కొడాలి నానిని పోలిన పాత్రలను పెట్టారి.. దానిద్వారా వాళ్లను కించ పరిచేలా చిత్రీకరణ చేశారని పిటిషనర్ వాదనగా ఉంది.. ఎన్నికల ముందు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా.. ఈ సినిమా విడుదల చేస్తున్నారు అని కోర్టులో వాదనలు వినిపించారు.. సినిమా విడుదల నిలిపివేయాలంటూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ సందర్భంగా.. డిసెంబర్ 18న సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సినీ నిర్మాత అడ్వకేట్.. స్క్రీనింగ్ కమిటీ కొన్ని అభ్యంతరాలు చెబితే వాటిని తొలగించామని.. ఆ తర్వాతే సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపారు. అయితే, ఇప్పుడు అభ్యంతరం తెలపటం సరికాదన్నారు.. మేం ఎవరిని కించ పరిచే విధంగా సినిమా తీయలేదనీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. 13 సీన్స్ తొలగించాలని చెబితే తీసేసారనీ, అందుకే సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చామని తెలిపారు సెన్సార్ బోర్డు అడ్వకేట్.. అన్ని వార్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం నిర్ణయాన్ని వాయిదా వేయగా.. ఈ రోజు.. ఈ సినిమాపై ఆర్డర్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!