ఏపీలో పీఆర్సీ విషయంలో కొన్ని సంఘాలు సంతృప్తిగా వున్నా యూటీఎఫ్ లాంటి సంఘాలు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడలో యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎవరూ ఈ పీఆర్సీతో సంతృప్తి చెందలేదన్నారు. సమావేశ హాజరు పట్టీ సంతకాలను ఒప్పందంపై సంతకాలుగా చూపిస్తున్నారన్నారు. ముగిసిపోయిన అధ్యాయం అని మంత్రులు అన్నారు సీఎం అభిప్రాయం మేం ప్రకటించాం.. సీఎం కు చెప్పేదేం లేదన్నారు.అహంకారం గా మాట్లాడే తీరు మార్చుకోవాలన్నారు. కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా…
ఏపీలో పీఆర్సీ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ప్రభుత్వం ఈ అంశంపై ఉద్యోగ సంఘాలతో చర్చలకు పిలిచింది. అయితే అక్కడి పరిణామాలపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఐఏఎస్ అధికారులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. సీఎస్ సమీర్ శర్మ మమ్మల్ని అవమానించారు. నలుగురం జేఏసీల నేతలు రిప్రజెంటేషన్ ఇవ్వటానికి వెళితే ఒక నిమిషం సమయం కూడా కేటాయించ లేదు. మర్యాద కోసం అయినా కూర్చోమని చెప్పలేదు. ఉద్యోగులు ప్రభుత్వంలో…
ఏపీలో ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేరేవరకూ పోరాటం ఆపేది లేదంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తోంది. సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్రంగా స్పందించారు. ఎస్మా చట్టం ప్రయోగించినా భయపడేది లేదన్నారు. శ్రీకాకుళం ఎన్జీవో హోమ్ వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన ఆయన మీడియాతో మాట్లాడారు.…
ఏపీలో పీఆర్సీ వ్యవహారంలో చిక్కుముడులు వీడకపోవడంతో జనవరి నెల జీతాల పరిస్థితిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికీ ప్రాసెస్ కాని జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే బాధ్యతను డీడీఓలకంటే పైస్థాయి అధికారులకు అప్పగించారు. ఎలాగైనా జీతాల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు వివిధ జిల్లాల కలెక్టర్లు. జీతాల బిల్లులు ప్రాసెస్ కాకుంటే ప్రత్యామ్నాయాలు చూడాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు డీడీఓలకంటే పై స్థాయి అధికారులకు బాధ్యతల…
ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలను చల్లబరిచే ప్రయత్నం చేశారు సీఎం జగన్. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ అదిరే శుభవార్త అందించారు. పీఆర్సీ వల్ల హెచ్ ఆర్ఏ తగ్గిందని భావించే ఉద్యోగులకు ఉద్యోగుల హౌస్ రెంట్ అలవెన్స్ ని రెట్టింపు చేసేసింది. విజయవాడ పరిసరాల్లో ఉన్న హెచ్ఓడీ కార్యాలయాల్లోని ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పీఆర్సీ జోవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన ఉద్ధృతం చేసిన తరుణంలో.. ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ…
ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పీఆర్సీపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో ఎస్మా ప్రయోగించే అంశంపై ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. కీలక శాఖలు కూడా ఉద్యమంలోకి వెళ్తామంటూ స్పష్టం చేయడంతో అలెర్టయింది ప్రభుత్వం. సమ్మె దిశగా అడుగులేస్తోన్న ఆర్టీసీ, విద్యుత్, వైద్యారోగ్య శాఖ ఉద్యోగులను ఎలాగైనా దారికి తీసుకురావాలని భావిస్తోంది. ఎస్మా ప్రయోగించే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఏయే శాఖల్లోని ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించవచ్చనే అంశంపై శాఖల వారీగా జాబితాను సిద్దం చేస్తోన్న…
ఏపీలో పీఆర్జీ జీవోలు రద్దుచేయాలని ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ చైర్మన్ కేవీ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో గెజిటెడ్ అధికారుల జేఏసీ చర్చలకు వెళ్ళడంలేదన్నారు. సోమవారం హైకోర్టు నిర్ణయాన్ని బట్టి మా కార్యాచరణ ఉంటుందన్నారు. కొత్త పీ ఆర్ సీ అంశం హై కోర్టు లో విచారణ ముగిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ పై జేఏసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఉద్యోగుల న్యాయమైన హక్కులు కాపాడుకునేందుకు చివరి వరకు పోరాడతాం అన్నారు. గతంలో ఉద్యోగుల హక్కులు కాపాడే…
ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు. విశాఖలో ఉన్న లక్షలాది మంది కార్మికులకు వైద్య సేవలు అందించేందుకు ఈఎస్ఐ ఆస్పత్రి, వైద్య కళాశాల నిర్మించాలని కేంద్రం ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వని కారణంగా కళాశాల లేకుండా ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. కేవలం ఆసుపత్రి నిర్మాణానికి రూ. 400 కోట్లు నిధులు కేంద్రం కార్మిక శాఖ మంజూరు చేసింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్ధలం సేకరించి ప్రతిపాదనలు…
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోందా? ఎన్నికల హామీ నిలబెట్టుకుంటున్నారు సీఎం జగన్. కొత్త జిల్లాల ఏర్పాటు పై ఫోకస్ చేసిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి ఒకటిరెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం. ప్రతి లోక్సభ నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన వైసీపీ హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసిన…