రాజమండ్రిలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీలు, ఆశావర్కర్ల ఆందోళనలపై ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ పేదల పక్షపాతి వారి ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వంపై ఈర్ష్యతో ప్రతిపక్షాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాయి.
గతంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది. ఎన్నికలకు ముందు అంగన్వాడీ వర్కర్లకు ఏడు వేల రూపాయల జీతం వచ్చేది. సీఎం జగన్ అంగన్వాడీ వర్కర్ల జీతాన్ని 11,500 రూపాయలకు పెంచారు. అంగన్వాడీ వర్కర్లకు 2013 నుంచి ప్రమోషన్లు లేవు. త్వరలో ప్రభుత్వం 560 గ్రేడ్ -2 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయనున్నామన్నారు. వచ్చే నెలలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తాం. రాష్ట్రంలో ప్రతి అంగన్వాడీ వర్కర్ కు స్మార్ట్ ఫోన్ ఉండేవిధంగా 56 వేల ఫోన్ లను కొనుగోలు చేస్తున్నాం అన్నారు మంత్రి వనిత. గత ప్రభుత్వం అంగన్వాడీలకు అరకొరగా నిధులు కేటాయిస్తే సీఎం జగన్ 18 వందల కోట్ల నిధులు వెచ్చిస్తున్నారని తెలిపారు తానేటి వనిత.